Rape Case: బెంగాల్ వైద్య విద్యార్థిని అత్యాచారం కేసులో ముగ్గురు అరెస్ట్

పశ్చిమ బెంగాల్ లో ఒడిశాకు చెందిన వైద్య విద్యార్థిని హత్య కలకలం రేపింది. ఈ కేసులో తాజాగా పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారు ఎవరన్నది మాత్రం వివరాలు తెలపలేదు. కేసు ఇంకా దర్యాప్తులో ఉందని చెబుతున్నారు. 

New Update
durgapur

వెస్ట్ బెంగాల్(west bengal) లో మరో మెడికల్ స్టూడెంట్(medical-student) అత్యాచారానికి గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  ఒడిశాకు చెందిన అమ్మాయి శోభాపర్ కాలేజీలో చదువుతోంది. శుక్రవారం రాత్రి తన స్నేహితుడితో కలసి బయటకు వెళ్ళింది. వీరిని పలువురు వెంబడించారు. కొంత దూరం వెళ్ళాక బాధితురాలిని బెదిరించి అడవిలోకి తీసుకెళ్ళి అత్యాచారం చేశారు. ఈ విషయం బయట ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బాధితురాలిని బెదిరించారు. అడవిలో స్పహ తప్పి, తీవ్ర రక్త స్రాంతో పడి ఉన్న విద్యార్థిని స్థానికులు గుర్తిచి ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ప్రస్తుతం ఆ అమ్మాయికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. 

బాధితుడితో పాటూ ముగ్గురు..

అయితే తమ కూతురికి జరిగిన అన్యాయాన్ని తెలుసుకున్న తల్లిందడ్రులు దుర్గాపూర్ కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ప్రకారం విచారణ చేసిన పోలీసులు బాధితురాలి స్నేహితుడితో పాటూ మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. దుండగులతో పాటూ స్నేహితుడు కూడా అత్యాచారంలో పాల్గొన్నాడని పోలీసులు చెబుతున్నారు. బాధితురాలిని తప్పుదారిపట్టించి.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడని.. ఆ తర్వాత ఆమె నుంచి ఫోన్‌, డబ్బును లాక్కొన్నాడని తెలిపారు.  ఈ కేసు విషయాన్ని దుర్గాపూర్ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. బాధితురాలి స్నేహితుడితో పాటూ మరి కొంత మందిని విచారిస్తున్నారు. ముగ్గురిని అదుపులోఇ కూడా తీసుకున్నారు. బాధితురాలి వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేశారు పోలీసులు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. 

Advertisment
తాజా కథనాలు