Duflo-Banerjee : ట్రంప్ ఆంక్షల ప్రభావం..అమెరికాను వీడనున్న నోబెల్ బహుమతి గ్రహీతలు

డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన ప్రవర్తన ప్రపంచ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. ట్రంప్‌ ఆంక్షల నేపథ్యంలో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన దంపతులు ఎస్తర్ డుఫ్లో, అభిజిత్ బెనర్జీలు అమెరికాను వీడేందుకు సిద్ధమయ్యారు.

New Update
Abhijit Banerjee and Esther Duflo

Abhijit Banerjee and Esther Duflo

Duflo-Banerjee : డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన ప్రవర్తిస్తున్న తీరు ప్రపంచ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. అయినా తన వైఖరిని ఏ మాత్రం మార్చుకోవడం లేదు. శత్రుదేశాలతో పాటు మిత్రదేశాలపై కూడా ఆంక్షులు విధిస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అనేక మంది ఆ దేశంతో ఉన్న సంబంధాలను వదులుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా ట్రంప్‌ ఆంక్షల నేపథ్యంలో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన దంపతులు ఎస్తర్ డుఫ్లో, అభిజిత్ బెనర్జీలు అమెరికాను వీడేందుకు సిద్ధమయ్యారు.

వారిద్దరూ కూడా స్విట్జర్‌ల్యాండ్‌కు వెళ్లనున్నారు. అక్కడి  యూనివర్సిటీ ఆఫ్ జూరిచ్‌లో ఏర్పాటు చేయనున్న కొత్త ఆర్థిక శాస్త్ర విభాగానికి వారు నేతృత్వం వహించనున్నారు. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ జ్యురిచ్ ఈ విషయాన్ని దృవీకరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం డుఫ్లో, అభిజిత్ బెనర్జీలు ఎమ్‌ఐటీలో ఉన్నారు. వచ్చే ఏడాది జులైలో ఫ్రొఫెసర్లుగా యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిచ్‌లో చేరనున్నారని తెలిపింది. అయితే, ఎమ్ఐటీలో కూడా పార్ట్‌టైమ్‌గా తమ బాధ్యతలు నిర్వహిస్తారని తెలుస్తోంది. అమెరికాలోని యూనివర్సిటీల నిధులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోత పెడుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం  ప్రాధాన్యం సంతరించుకుంది. జ్యూరిచ్ యూనివర్సిటీలో ఏర్పాటు చేయబోయే లీమన్ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఎడ్యుకేషన్, పబ్లిక్ పాలసీకి డుఫ్లో, బెనర్జీ దంపతులు నేతృత్వం వహిస్తారని యూనివర్సిటీ తెలిపింది. పేదరికాన్ని నిర్మూలించే చర్యలపై చేపట్ట నున్న పరిశోధనలను ప్రోత్సహించేందుకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులను ఈ విషయంలో అనుసంధానం చేసేందుకు వారు కృషి చేస్తారని వెల్లడించింది.

 అయితే ట్రంప్‌ అధ్యక్షుడిగా అయ్యాక అమెరికాలోని పలు ప్రముఖ యూనివర్శిటీల విధానాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అయితే ఇది అధ్యాపకులు, విద్యార్థులకు ఉన్న విద్యాపరమైన స్వాతంత్ర్యాన్ని అణచివేయడమేనన్న ఆందోళన అంతటా పెరుగుతోంది. ఫలితంగా మేధావులు అమెరికాను వీడి ఇతర దేశాలకు తరలిపోవడానికి సిద్ధమవుతున్నారన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.  అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు అమెరికాలోని వృత్తి నిపుణులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అమెరికా ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ Le Monde అనే న్యూస్‌పేపర్‌లో ప్రచురితమైన ఒక ఎడిటోరియల్ వ్యాసానికి మద్దతుగా డుఫ్లో సంతకం కూడా చేయడం గమనార్హం.  

Also Read: PAK-AFGHAN WAR: పరువు పోయిందిగా.. పాక్ సైనికులను పరిగెతిస్తున్న అఫ్గాన్ దళాలు.. వీడియోలు వైరల్!

Advertisment
తాజా కథనాలు