/rtv/media/media_files/2025/02/21/glrNBIUFyJ3R3ZL7hErq.jpg)
America migrants
అక్రమంగా అమెరికాలో నివాసం ఉంటున్న వారిని ఆ దేశాలకు పంపిస్తున్న విషయం తెలిసిందే. విడతల వారీగా భారతీయులను పంపుతున్న అగ్రరాజ్యం తాజాగా మరో విడతలో భారీగా భారతీయులను పంపించేందుకు సిద్ధమైంది. త్వరలోనే మరో 295 మంది భారతీయులను పంపించనున్నట్లు కేంద్రం తాజాగా వెల్లడించింది. ఈ మేరకు అమెరికాకు అక్రమంగా వలస వెళ్లిన వారిని తిరిగి పంపిస్తున్న అంశంపై పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు కేంద్ర విదేశాంగ శాఖ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టగానే అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతోందని చెప్పుకొచ్చింది.
Also Read: Khammam: ఖమ్మం ఆస్పత్రిలో కలకలం.. వృద్ధురాలి ప్రాణాలు తీసిన లిఫ్ట్!
అయితే అక్రమ వలసదారులను సైనిక విమానాల్లో ఆయా దేశాలకు పంపించడం సహా వారితో అమెరికా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపైనా కేంద్రం స్పందించింది. దీనిపై తమ ఆందోళనను అగ్రరాజ్య ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు పేర్కొంది. ఫిబ్రవరి 5వ తేదీన భారత్‌కు పంపించిన అక్రమ వలసదారులకు, ముఖ్యంగా మహిళలకు సంకెళ్లు వేసిన అంశాన్ని అమెరికా వద్ద ప్రస్తావించినట్లు చెప్పుకొచ్చింది. దీనికి అమెరికా కూడా సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించింది.
Also Read: GDB Survey: ఇండియాలో ఏ రాష్ట్రం మంచిదో చెప్పిన సర్వే.. కేరళ ఫస్ట్, పంజాబ్ లాస్ట్
భారత్ తన ఆందోళనలు తమ దృష్టికి తీసుకువచ్చిన తర్వాత ఫిబ్రవరి 15, 16 తేదీల్లో పంపించిన వలసదారుల్లో మహిళలు, చిన్నారులకు సంకెళ్లు వేయలేదని అమెరికా ధ్రువీకరించింది. వలసదారులు స్వదేశానికి చేరుకున్న తర్వాత వారితో చర్చించి మన అధికారులు కూడా దీన్ని నిర్ధారించుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. అమెరికాలో చట్ట విరుద్ధంగా నివాసం ఉంటున్న వారిలో మరో 295 మంది వివరాలను సంబంధిత ఏజెన్సీలు పరిశీలిస్తున్నాయని, త్వరలోనే వారిని కూడా అమెరికా స్వదేశానికి పంపించినట్లు చెప్పుకొచ్చింది.
ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఇప్పటి వరకూ 388 మంది భారత అక్రమ వలసదారులను సైనిక విమానాల్లో అమెరికా వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. వీరిలో 40 శాతం మంది పంజాబ్ వాసులే ఉన్నారు. ఆ తర్వాత హర్యానాకు చెందిన వారు ఉన్నారు. వీరిని సైనిక విమానాల్లో చేతులకు సంకెళ్లు వేసి, కాళ్లకు గొలుసులు కట్టి భారత్‌కు తీసుకురావడం ఆయా వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆందోళనకు దారి తీసింది.
అయితే అమెరికా ఇలా అక్రమ వలసదారులను వెనక్కి పంపించడం కొత్తేమీ కాదని అప్పట్లోనే కేంద్రం చెప్పింది. చాలా కాలం నుంచి ఈ ప్రక్రియ జరుగుతోందని 2009 నుంచి 2024 వరకు దాదాపు 15,500 మంది అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపించినట్లు తెలుస్తుంది.
Also Read: CM Revanth: చెన్నైకు చేరిన సీఎం రేవంత్ రెడ్డి..రేపు డీలిమిటేషన్ సదస్సులో...
Also Read: Earth Hour Day: నేడు వరల్డ్ ఎర్త్ అవర్ డే.. రాత్రి 8.30 నుంచి 9.30 మర్చిపోవద్దు
america | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates | trump