CM Revanth: చెన్నైకు చేరిన సీఎం రేవంత్ రెడ్డి..రేపు డీలిమిటేషన్ సదస్సులో...

తమిళనాడు ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెన్నైకు చేరుకున్నారు.  పునర్విభజనతో నష్టపోనున్న రాష్ట్రాల గళాన్ని వినిపించనున్నారు. రేపు ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో చెన్నైలోని గిండీలో గల ఐటీసీ చోళ హోటల్లో డీలిమిటేషన్ సదస్సు ప్రారంభం కానుంది. 

New Update
Revanth Reddy

Revanth Reddy

ప్రస్తుతం డీలిమిటేషన్ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. దక్షిణాది రాష్ట్రాలు ఈ డీలిమిటేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జనాభా ప్రాతిపాదికన జరిగే ఈ లోక్‌సభ పునర్విభజన ప్రక్రియ వల్ల ఉత్తరాది రాష్ట్రాలు లబ్ధి పొందుతాని.. దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2026లో డీలిమిటేషన్‌ను చేపట్టాలని యోచిస్తోంది. అందుకే దక్షిణాది రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలోనే  సీఎం స్టాలిన్ ఏడు రాష్ట్రాల సీఎంలకు, వివిధ పార్టీలకు లేఖలు రాశారు. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్‌ విధానానికి వ్యతిరేకంగా ''జాయింట్ యాక్షన్ కమిటీ'' ఏర్పాటు చేద్దామని పిలుపునిచ్చారు. మార్చి 22న చెన్నైలో జరగనున్న జేఏసీ సమావేశానికి హాజరుకావాలని కోరారు.

సీఎం రేవంత్ రెడ్డి చెన్నైకు..

రేపు జరగబోయే డీలిమిటేషన్ సదస్సుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెన్నై చేరుకున్నారు. ఈయనకు అక్కడ ఘన స్వాగతం లభించింది. స్వయంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ , రేవంత్ రెడ్డిని రిసీవ్ చేసుకున్నారు.   రేపు ఉదయం చెన్నైలోని గిండీలో గల ఐటీసీ చోళ హోటల్లో ఉదయం 10. 30 గంటలకు సదస్సు ప్రారంభం కానుంది. డీలిమిటేషన్ పై తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలు, పంజాబ్, ఒడిశా ఏ విధంగా నష్టపోతాయనే అంశంపై  రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. 

డీలిమిటేషన్ అంటే ఏంటి ? 

నియోజకవర్గం సరిహద్దులను నిర్ణయించి, ఏ నియోజకవర్గంలో ఎంతమంది జనాభా ఉండాలి.. ఏ గ్రామాలు, మండలాలు ఆ నియోజకవర్గంలో ఉండాలో నిర్ణయిస్తారు. ఈ ప్రక్రియనే పునర్విభజన లేదా డీలిమిటేషన్ అని అంటారు. జనాభా లెక్కలు చేసిన అనంతరం ఈ డీలిమిటేషన్‌ను చేపడతారు. అయితే ఒక నియోజకవర్గంలో లక్ష మంది కలిసి ఒక ఎంపీని ఎన్నుకోవడం, మరో నియోజకవర్గంలో 25 లక్షల మంది ఒక ఎంపీని ఎన్నుకోవడం అనేది జరగదు. ప్రతీ ఓటుకి కూడా సమానంగా విలువ ఉండాలనే సిద్ధాంత ప్రకారం డీలిమిటేషన్‌ ప్రక్రియ ఉంటుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో 30 లక్షల జనాభాకు ఒక ఎంపీ ఉన్నారు. కానీ తమిళనాడులో 18 లక్షల జనాభాకు ఒక ఎంపీ ఉన్నారు. ఇప్పుడు తమిళ ఓటర్‌ విలువ ఎక్కువగా, యూపీ ఓటర్ విలువ తక్కువగా ఉంటుంది. 

ఇలా జరగకుండా ఉండేందుకు జనాభా ప్రాతిపదికన ఎప్పటికప్పుడు నియోజకవర్గాల పునర్విభజన చేస్తారు. 1952, 1962, 1972, 2002లో పునర్విభజన సంఘాలు ఏర్పాటయ్యాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 82, 170 ప్రకారం జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేస్తారు. ఇలా జరిగినప్పుడు ఆయా రాష్ట్రంలో సీట్ల సంఖ్య పెంచడం లేదా తగ్గించడం ఉంటుంది. మనదేశంలో మొదటిసారిగా 1952లో లోక్‌సభ ఏర్పడింది. అప్పుడు కేవలం 489 మంది ఎంపీలు మాత్రమే ఉండేవారు. 1972లో చేపట్టిన డీలిమిటేషన్‌ ద్వారా ఆ సంఖ్య 545కి పెరిగింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు