GDB Survey: ఇండియాలో ఏ రాష్ట్రం మంచిదో చెప్పిన సర్వే.. కేరళ ఫస్ట్, పంజాబ్‌ లాస్ట్

రాష్ట్రాల్లో ప్రజల ప్రవర్తనను బట్టి గ్రాస్ GDB సూచీని విడుదల చేశారు. ఇందులో 21 రాష్ట్రాల్లో నాలుగు అంశాల్లో 30 ప్రశ్నలు అడిగారు. కేరళ 1వ స్థానంలో నిలిచింది. తమిళనాడు, వెస్ట్ బెంగాల్ 2,3 స్థానాల్లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లు చివరి ప్లేస్‌లో ఉన్నాయి.

New Update
GDB Survey

GDB Survey Photograph: (GDB Survey)

రాష్ట్రాల్లో ప్రజల ప్రవర్తన గురించి గ్రాస్ డొమెస్టిక్ బిహేవియర్ సూచీని విడుదల చేశారు. అందులో ఇండియాలోని రాష్ట్రాల ప్రవర్తనను కొలుస్తారు. బిహేవియర్, సెక్యురీటి, డైవర్సిటీ, లింగ వివక్షత వంటి సామాజిక సూచికలను పరిగణలోకి తీసుకొని ర్యాకింగ్ కేటాయించారు. ఇండియా టుడే గ్రూప్, హౌ ఇండియా లివ్స్, కాడెన్స్ ఇంటర్నేషనల్ సహకారంతో ఈ స్థూల దేశీయ ప్రవర్తన సర్వేను నిర్వహించారు. ఈ సర్వేలో 21 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 98 జిల్లాల నుండి 9,188 మంది అభిప్రాయాలను సేకరించారు. అందులో 54.4 శాతం అర్బన్, 45.6 శాతం రూరల్ ఏరియాలకు చెందిన వారు ఉన్నారు. ఈ సర్వేలో నాలుగు విభాగాల్లో మొత్తం 30 ప్రశ్నలు అడిగారు. ప్రజల ప్రవర్తన, సిటిజన్స్ సేఫ్టీ, లింగ సమానత్వం, డైవర్సిటీ అండ్ వివక్ష వంటి అంశాల్లో ఆయా రాష్ట్రాల ప్రజలకు ఉన్న అభిప్రాయాలను సేకరించారు. 

Also read: Google: ప్లే స్టోర్‌లో గూగుల్ 331 యాప్స్ రిమూవ్.. అవి మీ ఫోన్‌లో ఉంటే యమ డేంజర్

 మొత్తం 21 రాష్ట్రాల్లో  అందులో కేరళ స్టేట్ కేరళ ముందంజలో ఉంది. తరువాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు రెండు, మూడో స్థానంలో ఉన్నాయి. GDB సూచికలలో ఉత్తరప్రదేశ్, పంజాబ్ చివరి ర్యాంక్‌లో ఉన్నాయి. తెలంగాణ 8వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 11వ స్థానంలో  ఉంది. సర్వేలో పాల్గొన్న వారిలో 85 శాతం మంది టికెట్ లేకుండా రైల్వే ప్రయాణాలు చేస్తున్నట్లు తెలిసింది. 2023-24లో రైల్వేలు మాత్రమే 3.6 కోట్ల టికెట్ లేని ప్రయాణ కేసులను గుర్తించాయని ప్రభుత్వ డేటా వెల్లడించింది. దీని ఫలితంగా రూ.2,231.74 కోట్ల జరిమానాలు విధించబడ్డాయి. అంతేకాదు సర్వేలో 76% మంది ఆన్‌లైన్ చెల్లింపులను ఇష్టపడుతున్నారని తేలింది.- ర్యాంకింగ్స్ ప్రకారం కేరళ మళ్ళీ లింగ సమానత్వ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచింది, ఉత్తరప్రదేశ్ లాస్ట్‌లో ఉంది. ఇలా  4 అంశాల్లోనూ కేరళా ఉత్తమ ప్రజలు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. అందుకే ఫస్ట్ ర్యాంక్‌లో నిలిచారు.

Also read: Banks closed: దేశవ్యాప్తంగా 4 రోజులు బ్యాంకులు బంద్!

Advertisment
తాజా కథనాలు