Weather Alert: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు..
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం, బుధవారం రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం, బుధవారం రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
అసోం లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆరున్నర లక్షల మంది వరదల బారిన పడ్డారు.బ్రహ్మపుత్ర దాని ఉపనదులకు వరదలు భారీగా వచ్చి చేరటంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి సహాయక శిబిరాలలోని నిరాశ్రయులను సీఎం హిమంత బిస్వా పరామర్శించారు.
రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు భారత వాతారణ శాఖ తెలిపింది. కేరళను తాకిన 5 రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని పేర్కొంది.
వేసవి వేడితో అదిరిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు తీసుకువచ్చింది. ఈ ఏడాది ఎండలు ఎంత ఎక్కువ ఉన్నాయో.. అలానే వర్షాలు కూడా అంతే ఎక్కువగా ఉండొచ్చని IMD తన అంచనాలలో పేర్కొంది. రుతుపవనాల సీజన్లో వర్షాలు ఎక్కువగా పడే ఛాన్స్ ఉందని IMD ప్రకటించింది.
ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీర్ఘకాలిక సగటు వర్షాపాతం 87 సెంటీమీటర్లు ఉండగా.. ఈ ఏడాది 106 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
తెలంగాణలో రాగాల రెండురోజుల పాటు వడగాలులు వీచే అవకాశాలున్నాయని.. వాతావరణ శాఖ హెచ్చరించింది. రెండు, మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశాలున్నాయని తెలిపింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు ప్రజలు బయటకు రావద్దని సూచించింది.
ఏప్రిల్ నుంచి జూన్ మధ్యకాలంలో 10 నుంచి 20 రోజలు వరకు హీట్‌వేవ్ ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాజస్థాన్, ఒడిశా, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మధ్య మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర చత్తీస్‌గఢ్, ఉత్తర కర్నాటక రాష్టాల్లో ఎక్కువగా ఉండనుందని పేర్కొంది.
తెలంగాణలో రాబోయే మరో రెండు రోజుల పాటు వడగాలులు వీచే అవకాశాలున్నాయని హెదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
దేశంలో ఈ వేసవికి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఎల్నీనో ప్రభావంతోనే ఈసారి ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు పేర్కొంది. ఏపీ, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటకలో సాధారణం కంటే వేడి గాలులు వీచే అవకాశాలున్నాయని పేర్కొంది.