/rtv/media/media_files/2026/01/18/red-bag-2026-01-18-10-18-57.jpg)
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియా కోరినా మచాదో(Maria Corinna Machado)... తాజాగా తన బహుమతిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఇచ్చేశారు. రెండు రోజులుగా ఈ విషయంపై తెగ చర్చలు జరిగాయి. ఆయన గొప్ప వ్యక్తని... అలాంటి అధ్యక్షుడిని ప్రజలు పూర్తిగా నమ్మవచ్చని చెప్పారు. అలాగే తమ దేశ క్షేమం కోసం ట్రంప్(america president donald trump) చేసిన కృషిని మచాదో కొనియాడారు. అందుకు గుర్తుగానే నోబెల్ ను ఆయనకు అందజేశానని తెలిపారు. ఇక మచాదో, ట్రంప్ సమావేశంలో వెనెజువెలా భవిష్యత్తు గురించి చర్చించుకున్నారు. తమ దేశ ప్రజలు స్వేచ్ఛ కోసం ట్రంప్‌పై ఆధారపడొచ్చని మచాదో అన్నారు. మచాదో ఇచ్చిన నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్ కూడా స్వీకరించారు. మచాడో తన నోబెల్ పతకాన్ని తన వద్ద ఉంచాలని కోరిందని, ఇది పరస్పర గౌరవానికి గుర్తు అని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై నోబెల్ కమిటీ వెంటనే స్పష్టత ఇచ్చింది. ఒకసారి నోబెల్ శాంతి బహుమతి ఎవరికైనా ఇచ్చిన తర్వాత, దాన్ని మరో వ్యక్తికి బదిలీ చేయడం, పంచడం లేదా మార్చడం సాధ్యం కాదని తెలిపింది. ఇది నోబెల్ ఫౌండేషన్ నిబంధనలలో స్పష్టంగా ఉందని కూడా చెప్పింది.
Also Read : మరో మలేసియా విమానం మిస్సింగ్..11 మంది ప్రాణాలు గాల్లోనే..
ట్రంప్ బ్రాండెడ్ బ్యాగ్..
మచాదో నోబెల్ ను తనకు ఇచ్చినందుకు గానూ ఆమెకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక రెడ్ బ్యాగ్(Trump Merch Red Bag) ను బహుమతిగా ఇచ్చారు. ట్రంప్ తో భేటీ తర్వాత భేటీ తర్వాత తిరిగి వెళ్లేటప్పుడు ఆమె చేతిలో ఒక 'ట్రంప్ బ్రాండెడ్ స్వ్యాగ్ బ్యాగ్' కనిపించడం హాట్ టాపిక్ అయింది. ఆ ఎరుపు రంగు బ్యాగులో ఏముందో కచ్చితంగా తెలియదు కానీ..ట్రంప్ తన వీఐపీ అతిథులకు ఇచ్చే సాధారణ బహుమతుల జాబితా ఆధారంగా అందులో ఏమున్నాయో విశ్లేషకులు అంచనా వేశారు. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అని రాసి ఉండి, ట్రంప్ సంతకంతో కూడాని రెడ్ కలర్ క్యాప్ ఈ బ్యాగుకు ఉంటుంది. దీంతో పాటూ ఆయనకు ఇష్టమైన డైట్ కోక్ బాటిల్...దానిపైన ట్రంప్ బాధ్యతలు చేపట్టిన డేట్ జనవరి 20 అని ముద్రించి ఉంటుంది. అలాగే యూఎస్ క్యాపిటల్ భవనం స్కెచ్, బంగారు అక్షరాలతో ముద్రించిన లెదర్ డైరీ ఉంటాయి. వీటన్నిటితో పాటూ అధ్యక్షుడు ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ బొమ్మలతో కూడిన మెడల్, వైట్ హౌస్ కీ చైన్, క్రిస్మస్ ఆర్నమెంట్ ఉంటాయి. ట్రంప్ ముఖచిత్రంతో కూడిన నకిలీ 100 డాలర్ల నోటు, ఒక చిన్న గోల్డ్ పిన్ కూడా ఉంటాయని చెబుతున్నారు.
ఇవన్నీ ఇలా ఉంటే ట్రంప్ మచాదో మధ్య వెనిజువెలా రాజకీయాలకు సంబంధించి చర్చ జరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ దేశానికి తాత్కాలిక అధ్యక్షురాలుగా రోడ్రిగో ఉన్నారు. కానీ తానే పరిపాలిస్తానని ట్రంప్ అనౌన్స్ చేశారు. అయితే వెనెజువెలా విషయంలో భవిష్యత్తులో ఏం చేయాలి, పగ్గాలు ఎవరికి అప్పగించాలి అనే విషయాలపై ఇరువురూ చర్చించారని అంటున్నారు. దీనికి సంబంధించిన విషయాలు మాత్రం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు.
Also Read: Trump Vs Khamenei: కొత్త నాయకత్వం రావాలి..ఖమేనీని వెళ్లగొట్టాలని పిలుపిచ్చిన ట్రంప్
Follow Us