ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్...అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అయితే చాలా కాలంగా ఆయన ఇండియాలో ఎవరికీ మ్యూజిక్ చేయలేదు. బాలీవుడ్ కు సైతం రెహమాన్ మ్యూజిక్ చేసి చాలా ఏళ్ళు అయింది. హాలీవుడ్ లో తన కంటూ పేరు సంపాదించుకున్న రెహమాన్...తిరిగి స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆ తరువాత నుంచి తమిళ, తెలుగు సినిమాలకు మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు. రామ్ చరణ్ పెద్ది సినిమాకు ఆయనే సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే బాలీవుడ్ లో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు.
మతం వల్లనే ఇవ్వడం లేదు..
రెహమాన్ రీసెంట్ గా ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో బాలీవుడ్ లో సౌత్ ఇండస్ట్రీ వారిపై పక్షపాతం ఉందా అని ప్రశ్నించారు. దానికి సమాధానం చెబుతూ..వ్యక్తిగతంగా తానెప్పుడూ ఎలాంటి వివక్షను ఎదుర్కొలేదని రెహమాన్ చెప్పారు. అయితే ఎనిమిదేళ్లుగా బాలీవుడ్ లో ‘పవర్ షిఫ్ట్’ నెలకుందని.. సృజనాత్మకత లేని వారే కీలకంగా వ్యవహరిస్తున్నారని కామెంట్ చేశారు. దీనికి మతపరమైన అంశం కూడా దీనికి ఓ కారణమై ఉండొచ్చని అన్నారు. అది నాకు నేరుగా ఎదురుకాలేదు గానీ.. గుసగుసలు వినిపించాయి. నేను పని కోసం వెతకను. చిత్తశుద్ధి ఉంటే పనే మన వద్దకు వస్తుందని విశ్వసిస్తానని రెహమాన్ అన్నారు.
ఇలాంటి మాటలు మాట్లాడడం ఆశ్చర్యం..
రెహమాన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం బాలీవుడ్ లో పెద్ద దుమారమే రేగుతోంది. ఆయన ఇలాంటి కామెంట్స్ చేసి ఉండకూడదని బాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇలాంటివి చాలా డేంజరస్ కామెంట్స్ అని రచయిత్రి శోభా డే మండిపడ్డారు. అలాగే ఆయన ఇలాంటి స్టేటమ్ మెంట్ ఇవ్వడాన్ని తాను నమ్మలేకపోతున్నానని.. వాటిని కొందరు అపార్థం చేసుకోవచ్చని ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ అన్నారు.రెహమాన్‌కు బాలీవుడ్‌లో వర్క్ లేకపోవడానికి కారణం మతం కాదు. ముంబయిలో నాకు తెలిసిన చాలామందికి రెహమాన్‌పై గౌరవం ఉంది. అయితే కొంత కాలంగా రెహమాన్ అంతర్జాతీయంగా బిజీ అయిపోయారు. దాంతో పాటూ విదేశాల్లో ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. అలాంటి టైమ్ లో సినిమాలు చేస్తున్న వారు రెహమాన్ ను పెట్టుకోలేకపోవచ్చును. దానికి తోడు ఆయన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. చిన్న నిర్మాతలు ఆయనను అప్రోచ్ అవడం కష్టం. మతం కారణంగానే ఆయనకు అవకాశాలు తగ్గుతున్నాయనే దాన్ని నేను నమ్మను అని జావేద్ అక్తర్ అన్నారు. ఇదే విషయంపై సింగర్ షాక్ కూడా మాట్లాడుతూ..నిజంగా మతమే కారణమై ఉంటే..ఇప్పుడు కొందరు హీరోలు దధశాబ్దలుగా..స్టార్ హీరోలుగా ఉండేవారు కాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Also Read: Greenland Gambit: గ్రీన్ ల్యాండ్ ను వదిలేదే ల్యా.. డెన్మార్క్, యూకే, ఫ్రాన్స్ దేశాలపై 10 శాతం సుంకాల మోత
A.R. Rahman: బాలీవుడ్ పై కామెంట్స్..వివాదంలో సంగీత దర్శకుడు రెహమాన్..
ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ వివాదంలో చిక్కుకున్నారు. బాలీవుడ్ పై ఆయన చేసిన కామెంట్లు పెద్ద దుమారమే రేపుతున్నాయి. రెహమాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదు అంటూ బాలీవుడ్ పెద్దలు స్పందిస్తున్నారు.