India vs West Indies 3rd T20 Match: టీ20 క్రికెట్లో టీమిండియా(Team India) ర్యాంక్ ఏమో నంబర్ వన్.. వెస్టిండీస్(West Indies) ర్యాంక్ ఏమో ‘ఏడు’. అయినా పొట్టి ఫార్మెట్లో విండీస్ తోపే..! టీ20 క్రికెట్లో తనదైన రోజున ఎలాంటి జట్టునైనా మట్టికరిపించగలదు. రోహిత్, కోహ్లీ (Rohit & Kohli) లేకుండా బరిలోకి దిగుతున్న టీమిండియాకు కరీబియన్ జట్టు చుక్కలు చూపిస్తోంది. మొదటి రెండు టీ20ల్లో భారత్‌ను ఝలక్ ఇచ్చిన రోవ్‌మన్ పావెల్ టీమ్.. మూడో ఫైట్‌లోనూ చిత్తుచేయాలని తహతహలాడుతోంది. ఇటు టీమిండియా మాత్రం సిరీస్ గెలుపునకు వరుసగా మూడు మ్యాచ్‌లు గెలవాల్సిన స్థితిలో నిలిచింది. ఇవాళ(ఆగస్టు 8)న జరగనున్న మూడో టీ20లో టీమిండియా ఓడిపోతే సిరీస్ సమర్పించుకున్నట్టే. ఐదు టీ20ల సిరీస్‌లో విండీస్ ఇప్పటికే 2-0 లీడ్‌లో ఉంది.
పూర్తిగా చదవండి..గెలిస్తేనే నిలుస్తాం.. ఇవాళ విండీస్‌తో ‘మూడో’ ఫైట్!
వెస్టిండీస్, ఇండియా మధ్య మూడో టీ20 ఫైట్ గయానాలో జరగనుంది. భారత్ కాలమానం ప్రకారం రాత్రి 8గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో వెస్టిండీస్ 2-0ఆధిక్యంలో ఉండగా.. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే సిరీస్ కరీబియన్లదే. అందుకే టీమిండియాకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. బ్యాటింగ్‌లో తిలక్ వర్మ మినహా ఏ ఒక్క బ్యాటర్ కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోవడం టీమిండియాను కలవరపెడుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో ఓపెనర్ ఇషాన్ కిషన్ స్థానంలో జైస్వాల్‌ని తుది జట్టులోకి తీసుకునే అవకాశముంది.
Translate this News: