లారాకు రాం..రాం.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కి కొత్త హెడ్‌ కోచ్‌.. ఎవరంటే..?

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కొత్త హెడ్‌ కోచ్‌ వచ్చేశాడు. బ్రియాన్‌ లారా స్థానంలో న్యూజిలాండ్‌ స్టార్ ఆల్‌రౌండర్‌ వెటోరీని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం ఎంపిక చేసింది. ఈ విషయాన్ని తమ ట్విట్టర్‌ ఖాతాలో అధికారికంగా ప్రకటించింది. టెస్టుల్లో 300కుపైగా వికెట్లతో పాటు 3వేలకుపైగా రన్స్ చేసిన అతి కొద్ది మంది ఆల్‌రౌండర్లలో ఒకరైనా వెటోరీ రాకతోనైనా జట్టు తలరాత మారుతుందేమోనని టీమ్‌ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

New Update
లారాకు రాం..రాం.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కి కొత్త హెడ్‌ కోచ్‌.. ఎవరంటే..?

Sunrisers Hyderabad New Head Coach : ఐపీఎల్‌(IPL)లో ఘోరమైన ఆటతీరుతో లాస్ట్‌ ప్లేస్‌ కోసం పోటిపడే జట్టుగా అపకీర్తి తెచ్చుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌(Sunrisers hyderabad)కి కొత్త కోచ్‌ వచ్చేశాడు. ఇప్పటివరకు హెడ్‌ కోచ్‌గా సేవలందించిన బ్రియాన్‌ లారాకు జట్టు మేనేజ్‌మెంట్‌ బై బై చెప్పేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ కొత్త ప్రధాన కోచ్‌గా న్యూజిలాండ్ లెజెండ్ డేనియల్ వెటోరీ(Daniel Vettori)ని ఎంపిక చేసింది. ఈ విషయాన్ని తమ సోషల్‌మీడియా హ్యాండిల్స్‌లో SRH అనౌన్స్ చేసింది. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన వెటోరీ.. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టుకు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు. ఇక గతంలో బంగ్లాదేశ్ జట్టుకు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా, కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ బార్బడోస్ రాయల్స్‌కు హెడ్ కోచ్‌గా పని చేసిన అనుభవం వెటోరీ సొంతం. అంతర్జాతీయ స్థాయిలో వెటోరీకి ఉన్న అనుభవం కూడా చాలా ఎక్కువ. దీంతో లారా స్థానంలో వెటోరీని సెలక్ట్ చేసినట్టు తెలుస్తోంది.


వెటోరీ రాకతో రాత మారుతుందా?
ఒక్క మ్యాచ్‌ గెలవడం.. నాలుగైదు మ్యాచ్‌లు ఓడిపోవడం.. ఇది ఐపీఎల్‌లో కొన్ని సీజన్లగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తీరు. ఈ ఏడాది పాయింట్ల పట్టికలో అందరి కంటే దిగువ స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్‌.. ఇప్పుడు హెడ్‌ కోచ్‌ని మార్చేసింది. నిజానికి ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో హెడ్‌ కోచ్‌గా వ్యవహరించిన లారాపై అనేక విమర్శలున్నాయి. తుది జట్టు ఎంపికలో లారా అట్టర్‌ఫ్లాప్‌ అయ్యాడని హైదరాబాద్‌ ఫ్యాన్స్‌ మండిపడ్డారు. ఇదేం సెలక్షన్‌ రా బాబు అంటూ తలలు కొట్టుకున్నారు. ముఖ్యంగా 13కోట్ల ప్లేయర్‌ బోరబండ బ్రూక్‌ పదేపదే విఫలమవుతున్నా.. అతని స్థానంలో వేరే ఆటగాడిని ఆడించలేదంటూ ఫైర్ అయ్యారు. ఇలా ఒక్కటేంటి.. ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ చేసిన తప్పులు అన్నీఇన్నీ కావు.. వచ్చే ఏడాది ఈ తప్పులు రిపీట్ అవ్వకుండా ఉండేందుకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది.

మాములోడు కాదు:
18ఏళ్లకే న్యూజిలాండ్‌ టెస్టు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రికార్డు వెటోరీది. టెస్ట్ క్రికెట్‌లో న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించిన అతి పిన్న వయస్కుడు వెటోరీనే. జనవరి 27, 1979న ఆక్లాండ్‌లో పుట్టిన వెటోరీ కివీస్‌ జట్టుకు మూడు ఫార్మెట్ల(టెస్టు, వన్డే, టీ20)లోనూ అద్భుదంగా రాణించిన అది కొద్ది మంది ఆటగాళ్లలో ఒకరు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నరైన వెటోరీ బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు. న్యూజిలాండ్‌ తరుఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ వెటోరీనే. అంతేకాదు టెస్టు క్రికెట్ చరిత్రలో టెస్టుల్లో 300 కంటే ఎక్కువ వికెట్లు తీసిన మొదటి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కూడా. టెస్టుల్లో 300కుపైగా వికెట్లతో పాటు 3వేలకుపైగా రన్స్ చేసిన ఎనిమిదో ఆల్‌రౌండర్ వెటోరీ. క్రికెట్‌లో.. ముఖ్యంగా 90s కిడ్స్‌కి వెటోరీ అంటే చాలా ఇష్టం. అటు క్రేజ్‌తో పాటు ఇటు అద్భుతమైన టాలెంట్‌ కలిగి ఉన్న వెటోరీ రాకతోనైనా సన్‌రైజస్స్‌ జట్టు తలరాత మారుతుందానన్నది చూడాల్సి ఉంది.

Also Read: అరుదైన రికార్డు సాధించిన తిలక్‌ వర్మ..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు