IND-PAK WAR: భారత్‌పై విషం కక్కుతున్న చైనా.. S-400 ధ్వంసం అయినట్లు ఫేక్ న్యూస్!

భారత్-పాక్ యుద్ధ సమయంలో చైనా మన దేశంపై విషం కక్కుతోంది. S-400 డిఫెన్స్ సిస్టమ్‌ను పాక్ జేఎఫ్‌-17 ధ్వంసం చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తోంది. S-400ను ధ్వంసం చేయలేదని, ఫేక్ న్యూస్‌ను నమ్మవద్దని భారత సైన్యం తెలిపింది.

New Update

చైనాతో కలిసి పాక్ భారత్‌పై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోంది. అత్యంత శక్తివంతమైన భారత్ గగనతల రక్షణ వ్యవస్థ ఎస్‌-400‌ను ధ్వంసం చేసినట్లు ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేస్తోంది. దాదాపుగా 600 కిలోమీటర్ల వరకు రాడార్ రేంజ్ ఉంటుంది. దీన్ని పాకిస్తాన్ జేఎఫ్‌-17 యుద్ధ విమాన క్షిపణితో కూల్చేసిందని చైనా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇది ఫేక్ న్యూస్ అని, ఎస్‌-400‌ను ధ్వంసం చేయలేదని భారత సైనికాధికారులు వెల్లడించారు.

ఇది కూడా చూడండి: Pakistan: 'మా రాజకీయ నేతల ఇళ్లపై దాడులు చేయండి'.. పాక్‌లో ప్రజల తిరుగుబాటు

ఇది కూడా చూడండి: BIG BREAKING: మళ్లీ మొదలైన యుద్ధం.. పాకిస్థాన్ కాల్పులు

ఇది కూడా చూడండి: IND-PAK WAR: వార్ ఎఫెక్ట్.. Deloitte, HCL, టెక్ మహీంద్రాతో పాటు WFH ప్రకటించిన కంపెనీల లిస్ట్ ఇదే!

బాలిస్టిక్ క్షిపణులు ఉపయోగిస్తున్నట్లు..

ఇదిలా ఉండగా ఇటీవల భారత సైన్యం సంచలన ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ దాడుల గురించి వివరించారు. పాక్ దాడులను తిప్పికొట్టినట్లు కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. పాకిస్తాన్ రెచ్చగొడుతూ దాడులు చేస్తుంది. 24 ఫైటర్ జెట్‌లతో భారత్‌పై దాడికి దిగింది. వీటిని భారత్ తిప్పికొట్టిందని తెలిపారు. ప్రతీకార దాడుల్లో బాలిస్టిక్ క్షిపణులు ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే S-400ను ధ్వంసం చేశామంటూ పాక్ తప్పుడు ప్రచారం చేస్తోంది. కానీ ఇది అసత్యమని, పాకిస్తాన్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు