BIG BREAKING: కోర్టులోనే కన్నుమూసిన మరో న్యాయవాది!
సికింద్రాబాద్ కోర్టులో విషాదం చోటు చేసుకుంది. వెంకటరమణ అనే న్యాయవాది కోర్టు ఆవరణలోనే గుండెపోటుకు గురై కుప్ప కూలారు. ఆస్పత్రికి చేరే లోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు. నిన్న హైకోర్టులో వేణుగోపాల్ అనే న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే.