AP Liquor Scam: మొత్తం రూ.16 వేల కోట్లు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను తలదన్నేలా.. RTV చేతిలో సంచలన నిజాలు!

ఏపీ లిక్కర్ స్కామ్ లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం రూ.16వేలకోట్ల అవినీతి జరిగినట్లు ఆధారాలను అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఆడిట్ రిపోర్ట్ RTV చేతిలో ఉంది. వివరాలు ఈ ఆర్టికల్ లో..

New Update

ఏపీ లిక్కర్ స్కామ్ లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీని తలదన్నేలా ఇక్కడ లిక్కర్ స్కామ్ జరిగినట్లు తెలుస్తోంది. మొత్తం రూ.16వేలకోట్ల అవినీతి జరిగినట్లు ఆధారాలను అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఆడిట్ నివేదిక ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరినట్లు సమాచారం. ఈ సంచలన నివేదిక RTV చేతికి చేరింది. ఈ ఆడిట్‌ రిపోర్టును పరిశీలిస్తే అనేక సంచలన విషయాలు ఉన్నాయి. I&PR అనుమతి లేకుండా అప్పటి సీఎం బర్త్‌డే కోసం రూ.3.15 కోట్ల ప్రకటనలను ఎక్సైజ్ శాఖ ఇచ్చినట్లు అందులో పేర్కొన్నారు. CCTV కొనుగోలు కోసం ఎక్సైజ్‌శాఖ నిధుల నుంచి రూ.71లక్షలు చెల్లింపులు చేశారు.

ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్.. అక్యూట్  రేటింగ్ అండ్ రీసెర్చ్ కంపెనీలకు ఇష్టారాజ్యంగా రూ.5కోట్లు చెల్లింపులు చేశారంటూ ఆడిట్ నివేదికలో పేర్కొన్నారు. బ్యాంకుల ద్వారా NCDS రూపంలో రూ.8305 కోట్ల చెల్లింపులు జరిగినట్లు తేల్చారు. 2022-23లో రూ.1500 కోట్లు రుణాలను ఇతర పనులకు మళ్లింపులు చేసినట్లు నివేదికలు పేర్కొన్నారు. ఎక్సైజ్‌ శాఖలో నిధుల మళ్లింపు స్కామ్ లో రమేష్ రెడ్డి, వాసుదేవ రెడ్డి, కరీముల్లా, OSD వేణుగోపాల్, నాగేశ్వరరావు, ES.శౌరి, సీఐ రమేష్, DGM చరణ్, BC సత్యప్రసాద్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు