Online Betting: నా సోదరుడు, మరదలు అప్పులు తెచ్చారు.. నేనిక తీర్చలేను: ఆన్లైన్ బెట్టింగ్‌కు ముగ్గురు బలి!
కర్ణాటకలోని మైసూర్లో ఆన్లైన్ బెట్టింగ్‌కు ముగ్గురు బలైయ్యారు. జోశి ఆంథోని ఆత్మహత్య చేసుకునేముందు ఓ వీడియో చేశాడు. తన అన్న,మరదలు రూ.80లక్షల వరకు అప్పులు చేశారని అవి తీర్చలేకపోతున్నానని పేర్కొన్నాడు. ఆ వీడియో వైరల్ కావడంతో అతడి అన్న,మరదలు ఉరివేసుకున్నారు.