Warangal Doctor Murder Case: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఆమె చేతిలోనే బలయ్యాడు - భర్త ప్రాణం తీసిన అక్రమసంబంధం!
వరంగల్లో డాక్టర్ సుమంత్ రెడ్డిపై హత్యాయత్నం సంచలనం సృష్టించింది. అక్రమసంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తపై దాడి చేయింది భార్య. ఈ ఘటనలో గాయపడిన సుమంత్ హాస్పిటల్లో రాత్రి మృతి చెందాడు. నేడు ఖాజీపేటలో సుమంత్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి.