Warangal Doctor Murder Case: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఆమె చేతిలోనే బలయ్యాడు - భర్త ప్రాణం తీసిన అక్రమసంబంధం!

వరంగల్లో డాక్టర్ సుమంత్ రెడ్డిపై హత్యాయత్నం సంచలనం సృష్టించింది. అక్రమసంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తపై దాడి చేయింది భార్య. ఈ ఘటనలో గాయపడిన సుమంత్ హాస్పిటల్‌లో రాత్రి మృతి చెందాడు. నేడు ఖాజీపేటలో సుమంత్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి.

New Update
warangal doctor Sumanth Reddy murder

warangal doctor Sumanth Reddy murder

వరంగల్లో జరిగిన డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యాయత్నం కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ మర్డర్ ప్లానింగ్ వేసింది మరెవరో కాదు.. సుమంత్ రెడ్డి భార్యనే. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి ఫ్లోరా కట్టుకున్న భర్తనే చంపాలనుకుంది. ఇందులో భాగంగానే ఈ నెల 20న సుమంత్ రెడ్డిపై తన ప్రియుడు సామ్యూల్‌తో దాడి చేయించింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన డాక్టర్ సుమంత్.. ఎంజీఎంలో చికిత్స పొందుతూ అర్థరాత్రి 12.51 గంటలకు మృతి చెందాడు. దాదాపు 8 రోజులు మృత్యువుతో పోరాడి డాక్టర్ సుమంత్ చివరకు ప్రాణాలు విడిచాడు. నేడు అతడి అంత్యక్రియలు ఖాజీపేటలో నిర్వహించనున్నారు.

Also Read: హిందూ అమ్మాయితో పెళ్లి.. ముస్లిం వ్యక్తిని చితకబాదిన లాయర్లు!

ఏం జరిగింది?

కారులో వెళ్తున్న సుమంత్‌ను అడ్డుకున్న కొంతమంది దుండగులు ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన సుమంత్‌ను స్థానికులు గమనించి హాస్పిటల్‌లో చేర్పించారు. అయితే ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. డాక్టర్ సుమంత్ రెడ్డిని చంపేందుకు సంగారెడ్డిలో మర్డర్ ప్లానింగ్ జరిగినట్టుగా పోలీసులు తేల్చారు. ఈ మర్డర్ ప్లానింగ్ వేసింది మరెవరో కాదు.. సుమంత్ భార్యనే అని గుర్తించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను చంపాలనుకుందని పోలీసులు తెలిపారు. ప్రియుడికి సుపారి ఇచ్చి మరి.. తన భర్తను హత్యచేయాలని సుమంత్ భార్య స్కెచ్ వేసినట్లుగా దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.

Also Read: ఈశా ఫౌండేషన్‌కు బిగ్‌ రిలీఫ్‌.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం

జిమ్‌ ట్రైనర్‌తో అక్రమసంబంధం 

డాక్టర్ సుమంత్ రెడ్డి, ఫ్లోరా అనే మహిళ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సుమంత్ రెడ్డి కొన్ని రోజుల పాటు డాక్టర్‌గా సంగారెడ్డిలో పనిచేశాడు. ఆ సమయంలో అతని భార్య ఫ్లోరా ఓ జిమ్‌కు వెళ్లేది. అక్కడే ఆమెకు సామెల్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే ఈ విషయం సుమంత్‌కు తెలిసిపోవడంతో ఫ్లోరాను మందలించాడు. ఆ తర్వాత భార్యను తీసుకుని వరంగల్‌కు షిఫ్ట్ అయిపోయాడు.

Also Read: HYD: పుప్పాలగూడలో అగ్నిప్రమాదం..పాపతో సహా ముగ్గురు మృతి

కాజీపేటలో సుమంత్ ఓ క్లినిక్ పెట్టుకోగా.. ఫ్లోరా రంగశాయిపేటలో డిగ్రీ లెక్చరర్‌గా పనిచేస్తుంది. అప్పుడప్పుడు ప్రియుడు సామెల్ ను కలుస్తూ ఉండేది. ఇద్దరూ రోజు కలుసుకోవడం కష్టంగా ఉండటంతో భర్తను చంపేయాలని ఫ్లోరా, సామెల్ నిర్ణయించుకున్నారు. సామెల్ కు కొంత డబ్బు ఇచ్చి సుమంత్‌ను చంపేయమని చెప్పింది ఫ్లోరా.  

ఈ మర్డర్ చేసేందుకు సామెల్ గచ్చిబౌలిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రాజు సహాయం తీసుకున్నాడు. ప్లాన్ లో భాగంగా వరంగల్ భట్టుపల్లిలో ఫిబ్రవరి19న సుమంత్ కారులో వెళ్తుండగా.. అతన్ని అడ్డగించి అతడిపై ఐరన్ రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మహారాష్ట్రలో నిందితులను పట్టుకున్నారు.  

Advertisment
Advertisment