భద్రాచలంలో విషాదం.. ఇద్దరు యువకుల ప్రాణం తీసిన పుణ్యస్నానం

గోదావరి నదిలో పుణ్యస్నానాలకు వెళ్లిన ఇద్దరు యువకులు మృతి చెందారు. మెడిసిన్‌లో సీట్ రావడంతో ఓ యువకుడు కుటుంబ సభ్యులతో భద్రాచలం వెళ్లాడు. స్వామి దర్శనం చేసుకున్న తర్వాత స్నానం కోసం గోదావరిలో ఇద్దరు యువకులు దిగి గల్లైంతయ్యారు. అక్కడిక్కడే వారు మృతి చెందారు.

New Update
Bhadrachalam

Bhadrachalam Photograph: (Bhadrachalam )

భద్రాచలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గోదావరి నదిలో పుణ్య స్నానాలకు వెళ్లిన ఇద్దరు యువకులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శ్రీసీతారామచంద్రస్వామి దర్శనం కోసం ఇద్దరు యువకులు వెళ్లారు. స్వామి దర్శనం తర్వాత పుణ్యస్నానాలు ఆచరించేందుకు స్నాన ఘట్టం దగ్గర గోదావరి నదిలో ఇద్దరు యువకులు మునిగారు.

ఇది కూడా చూడండి: TTD Jobs: టీటీడీలో ఉద్యోగాలు.. నిరుద్యోగ యువతకు చైర్మెన్ అదిరిపోయే శుభవార్త!

స్నానానికి దిగి మృతి..

స్నానం కోసం మునిగిన పది నిమిషాల్లోనే ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. దాదాపుగా గంటసేపు గాలించి గల్లంతైన యువకులను గజ ఈతగాళ్లు ఒడ్డుకు చేర్చారు. ఇంతలోనే ఆ ఇద్దరు యువకులు మృతి  చెందారు. మృతులు ఇద్దరు కూడా సొంత బావమరిదిలు. పవన్ (23) ఖమ్మం జిల్లా, హరిప్రసాద్ (23) వికారాబాద్ జిల్లాకి చెందినట్లు గుర్తించారు.

ఇది కూడా చూడండి:  హైదరాబాద్‌కు AICC ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్.. ముందున్న సవాళ్లు ఇవే..! 

హరిప్రసాద్‌కు ఇటీవల మెడిసిన్‌లో సీట్ రావడంతో మొక్కులు చెల్లించుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి భద్రాచలం వెళ్లారు. పవన్, హరిప్రసాద్ స్నానానికి వెళ్లగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. కన్న కొడుకు మృతదేహం ఒడ్డుకు చేరడంతో గుండె పగిలేలా ఏడుస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. 

ఇది కూడా చూడండి: Uttarakhand: ఉత్తరాఖండ్‌లో దారుణం.. హిమపాతంలో చిక్కుకున్న 57 మంది కార్మికులు

ఇదిలా ఉండగా ఇటీవల గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమిర్‌గఢ్ తాలూకాలోని కునియా గ్రామం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ రాష్ట్ర రవాణా సంస్థ (RSRTC) బస్సు హైవేపై రాజస్థాన్‌లోని సిరోహి వైపు వెళుతోంది. అదే సమయంలో బొలెరో SUV కారు అదే రోడ్డులో రాంగ్ రూట్‌లో వచ్చి బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదం చాలా తీవ్రంగా ఉండటంతో SUVలో ఉన్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు