/rtv/media/media_files/2025/02/28/I5KXDFFxt6vpsVW2IXny.jpg)
Son Steals 1 Crore From his Own House In Uttar Pradesh
కొడుకు తప్పు చేసినప్పుడు అతడిని మందలించే బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది. ముఖ్యంగా తండ్రులు కొడుకులు చేసే చెడు పనులకు చివాట్లు పెట్టడమే కాకుండా కొడుతుంటారు కూడా. అయితే ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. చెడు సావాసాలకు అలవాటు పడ్డ కొడుకును తండ్రి మందలించాడు. అతడిని ఇంట్లో నుంచి వెళ్లగొడతానని.. ఆఖరికి ఆస్తి కూడా ఇవ్వనని హెచ్చరించాడు. దీంతో ఆ కొడుకు తన తండ్రిపై పగ పెంచుకున్నడు. తన స్నేహితులతో కలిసి సొంత ఇంట్లోనే దొంగతనం చేశాడు. రూ.కోటి రూపాయల విలువైన డబ్బులు, నగలు అపహరించి పారిపోయాడు.
Also Read: హిందూ అమ్మాయితో పెళ్లి.. ముస్లిం వ్యక్తిని చితకబాదిన లాయర్లు!
ఇక వివరాల్లోకి వెళ్తే.. కాన్పూర్‌లోని పాంకి ప్రాంతంలో ఓ వ్యాపారవేత్త బట్టలకు రంగులు వేసే ఫ్యాక్టరీని నడుపుతున్నాడు. అతడి కుమారుడు పదో తరగతి చదువుతున్నాడు. కానీ ఆ అబ్బాయి మాత్రం స్నేహితులతో చెడు పనులకు అలవాటు పడ్డాడు. కొడుకు చేస్తున్న పనులను తెలుసుకున్న తండ్రి అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలా చెడు అలవాట్లు మానకపోతే ఇంటి నుంచి వెళ్లగొడతానని.. ఆస్తి కూడా ఇవ్వనంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఫిబ్రవరి 27న కొడుకు తన ఆరుగురు స్నేహితులతో కలిసి సొంత ఇంట్లోనే చోరి చేశాడు. రూ.80 లక్షల విలువైన బంగారం, వెండి, రూ.20 లక్షల నగదును వాళ్లు ఎత్తుకెళ్లారు.
Also Read: ఈశా ఫౌండేషన్‌కు బిగ్ రిలీఫ్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం
దీంతో ఆ తండ్రి ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇంటి పరిసర ప్రాంతాలతో సహా సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. చివరికి మైనర్ బాలుడైన ఆ వ్యాపారుడి కొడుకును అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడ్ని జువైనల్ హోమ్‌కు తరలించారు. ఆ బాలుడితో పాటు దొంగతానానికి పాల్పడ్డ మరో నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లనుంచి రూ.4 లక్షల నగదు, 165 గ్రాములకు పైగా బంగారం, 3 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉండగా.. వాళ్ల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు నిందితుల్లో ఇద్దరు గతంలో కూడా చోరీ కేసులో అరెస్టయినట్లు పేర్కొన్నారు.
Follow Us