Manav Sharma: తాగొచ్చి కొట్టేవాడు...ఇంటినుంచి గెంటేశాడు.. మానవ్ శర్మ భార్య సంచలన కామెంట్స్

భార్య పెట్టే టార్చర్ తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆత్మహత్యకు ముందు అతను మాట్లాడిన 6 నిమిషాల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే మానవ్ ఆరోపణలపై అతని భార్య నికిత శర్మ ఖండించింది.  

New Update
manav sharma

భార్య పెట్టే టార్చర్ తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh) లో చోటుచేసుకుంది.  ఆత్మహత్యకు ముందు అతను మాట్లాడిన 6  నిమిషాల వీడియో ఇప్పుడు సోషల్ మీడియా (Social Media) లో వైరల్ గా మారింది.  35 ఏళ్ల మానవ్ శర్మ టీసీఎస్ కంపెనీలో రిక్రూట్‌మెంట్ మేనేజర్‌గా పనిచేసేవాడు. అతనికి నికితా శర్మ అనే అమ్మాయితో 2024 జనవరి 30వ తేదీన  పెళ్లైంది. అయితే తన భార్య తనను చాలా టార్చర్ పెడుతుందని.. అది తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలని అనుకున్నానని ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు.  తన భార్య తనను తీవ్రంగా వేధించిందని.. ఆమె ప్రవర్తనపై కూడా తనకు అనుమానం వచ్చిందని వీడియోలో కన్నీళ్లతో చెప్పాడు. 

Also Read :  తాగొచ్చి కొట్టేవాడు...ఇంటినుంచి గెంటేశాడు.. మానవ్ శర్మ భార్య సంచలన కామెంట్స్

Also Read :  స్కూల్ విద్యార్థులకు అలర్ట్.. ఆ రోజు నుంచే ఏపీలో ఒంటిపూట బడులు

పెళ్లయినప్పటీ నుంచి ఎప్పుడు కూడా తనతో మంచిగా లేదని.. చాలా దురుసుగా ప్రవర్తించేదని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.  గతంలో కూడా అత్మహత్య చేసుకునేందుకు తాను ప్రయత్నించానని కానీ తనకు తల్లిదండ్రులు గుర్తుకు రావడంతో  వెనక్కి తగ్గినట్లుగా వెల్లడించాడు.  కానీ రోజురోజుకూ  తన భార్య పెడుతున్న మానసిక క్షోభ (Wife Torcher) ను తట్టుకోలేక చనిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించాడు. ఈ వీడియోలో మానవ్ తన కుటుంబ సభ్యులకు క్షమాపణలు కూడా చెప్పాడు. మమ్మీ, డాడీ, అక్కూ.. సారీ, ఇక నేను వెళ్లిపోతున్నా అని తెలిపాడు.  

Also Read :  సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో భారత్‌ను లీడర్‌గా నిలిపేందుకే "విజ్ఞాన్‌ వైభవ్‌'

మానవ్ గృహ హింసకు పాల్పడ్డాడు :  నికిత

ఈ వీడియోలో తనతో పాటుగా ఈ సమాజంలో  తనలాగా వేధింపులు ఎదుర్కొంటున్న మిగితా మగాళ్ల గురించి కూడా మాట్లాడాడు మానవ్ శర్మ. పురుషులకు కూడా ప్రత్యేకమైన చట్టాలు రావాలన్నాడు.  ఎవరో ఒకరు మగవారి గురించి కూడా మాట్లాడాలని  వెల్లడించాడు.  అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  అయితే మానవ్ ఆరోపణలపై అతని భార్య నికిత శర్మ ఖండించింది.  మానవ్ గృహ హింసకు పాల్పడ్డాడని నికిత ఆరోపించింది. మానవ్ తాగొచ్చి తనను కొట్టేవాడంది.  అతని కుటుంబ సభ్యులు కూడా తనతో అనుచితంగా ప్రవర్తించి నన్ను ఇంటి నుండి గెంటేశారని నికిత వాపోయింది. ఈ ఘటనపై మానవ్ శర్మ తండ్రి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. తన  కోడలు, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి తన కొడుకును తీవ్రంగా బెదిరించినట్లుగా ఫిర్యాదులో తెలిపాడు.  దీంతో మానవ్ శర్మ తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించాడు.  

Also read :  cabinet meeting : మార్చి 6న తెలంగాణ మంత్రివర్గ సమావేశం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు