Road Accident: కారును ఢీకొట్టిన ట్రక్కు.. ఎనిమిది మంది మృతి
మధ్యప్రదేశ్‌లో ఎస్యూవీ వాహనం, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో 8మంది మృతి చెందారు. మరో 14మంది గాయపడ్డారు. ఈ ఘటన సీధీ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగింది.
మధ్యప్రదేశ్‌లో ఎస్యూవీ వాహనం, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో 8మంది మృతి చెందారు. మరో 14మంది గాయపడ్డారు. ఈ ఘటన సీధీ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగింది.
జవహర్‌నగర్, లాలాగూడలో తల్లీకూతుళ్ల హత్యల కేసులో నిందితుడు పోలీసులకు దొరికాడు. యూపీకి చెందిన అరవింద్ అలియాస్ అరుణ్ వీరిని హత్య చేశాడు. దాని నుంచి తప్పించుకోవడం కోసం యూట్యూబ్,వెబ్ సిరీస్ లు చూసినట్లు పోలీసులకు తెలిపాడు
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశహ్యప్తంగా సంచలనం సృష్టించిన అమృత ప్రణయ్ హత్య కేసులో ఈరోజు నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు వెల్లడించనుంది. 2018 సెప్టెంబర్ 14న పరువుహత్యకు ప్రణయ్ గురయ్యాడు. విచారణ పూర్తిచేసి 1600పేజీల్లో చార్జిషీట్ నివేదికను రూపొందించారు.
తెలంగాణలో 18 నెలల బాబు పల్లీ గింజ నోటిలో ఇరుక్కుని చనిపోయిన ఘటన చోటుచేసుకుంది. వెంటనే తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయింది. చికిత్స తీసుకుంటూ ఆ బాబు మృతి చెందాడు. 18 నెలల కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమన్నీరవుతున్నారు.
ఏలూరులో ఆశ్రమం హాస్పిటల్ సమీపంలో ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 30 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మహారాష్ట్ర ముంబైలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. నాగ్పాడలోని నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్‌పై వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఊపిరాడక నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. ట్యాంక్ శుభ్రం చేయడానికి ఐదుగురు లోపలికి దిగారు.
ఏపీ విశాఖ పట్నంలో దారుణం జరిగింది. ఉమెన్స్ డే రోజున మేఘాలయ హోటల్లో రోజా అనే మహిళ అనుమానస్పదంగా మృతి చెందింది. ఎన్ఆర్ఐ డాక్టర్. పి.శ్రీధర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఆత్మహత్య చేసుకుందా, లేక చంపేశారా అనే విషయం తెలియాల్సివుంది.
ఉత్తరప్రదేశ్‌లో దుండగులు జర్నలిస్ట్‌ను కిరాతకంగా చంపారు. సీతాపూర్‌లో లక్నో, ఢిల్లీ హైవేపై రాఘవేంద్ర బాజ్‌పాయ్ బైక్‌ను ఢీకొట్టి గన్‌తో కాల్చారు. పోలీసులు అతన్ని హాస్పిటల్‌కు తరలించారు. యాక్సిడెంట్ అనుకున్నారు.. బుల్లెట్ గాయాలు చూసి హత్య అని తెలిసింది.
కాకినాడ జిల్లా ఎక్సైజ్ సిబ్బంది అత్యుత్సాహం ఒక యువకుడి నిండు ప్రాణం తీయగా,మరో యువకుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. మద్యం ఉందన్న అనుమానంతో ఎక్సైజ్ పోలీసులు బైక్‌ను వెంబడించగా ఎదురుగా వస్తున్నలారీ ఢీకొని ఓ విద్యార్థి చనిపోగా, మరోకరు గాయపడ్డారు.