AP Crieme: స్టార్ హోటల్ బాత్రూమ్‌లో రోజా అనుమానస్పద మృతి.. ఎన్నారై డాక్టర్ అరెస్ట్!?

ఏపీ విశాఖ పట్నంలో దారుణం జరిగింది. ఉమెన్స్ డే రోజున మేఘాలయ హోటల్లో రోజా అనే మహిళ అనుమానస్పదంగా మృతి చెందింది. ఎన్‌ఆర్‌ఐ డాక్టర్. పి.శ్రీధర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఆత్మహత్య చేసుకుందా, లేక చంపేశారా అనే విషయం తెలియాల్సివుంది. 

New Update
betting app suicide

TG Crime

AP Crieme: ఏపీ విశాఖ పట్నంలో దారుణం జరిగింది. ఉమెన్స్ డే రోజున మేఘాలయ హోటల్లో ఓ మహిళ అనుమానస్పదంగా మృతి చెందింది. మూడు రోజుల కిందట ఈ ఘటన జరగగా మహిళ దినోత్సవం రోజు వెలుగులోకి వచ్చింది. ఓ ఎన్నారై డాక్టర్ ఈ హత్యకు పాల్పడ్డట్లు అనుమానిస్తున్న 3 టౌన్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. 

అమెరికా నుంచి వచ్చి..

ఈ మేరకు అమెరికాలో ఉంటున్న రోజా అనే మహిళ తన స్నేహితుడు, ఎన్‌ఆర్‌ఐ డాక్టర్. పి.శ్రీధర్‌ను కలవటానికి 4 రోజుల కిందట విశాఖ వచ్చినట్లు గుర్తించారు. అయితే శ్రీధర్ కూడా 4 రోజులుగా మేఘాలయ హోటల్ లో ఉంటున్నాడని, అతని రోజా అక్కడికి వచ్చినట్లు నిర్ధారించారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందని, దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుందా లేక శ్రీధర్ చంపేశాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఇష్యూపై మీడియాతో మాట్లాడిన సీపీ.. హంతకులెవరైనా సరే వదిలిపెట్టవని తెలిపారు. శ్రీధర్ అమెరికాలో గైనకాలజిస్ట్ గా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. 

Also Read: కన్నడ హీరోయిన్ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు.. ఏడాదికి 27 దుబాయ్ ట్రిప్స్

ఇదిలా ఉంటే.. ఏపీ అనంతపురం జిల్లాలో జరిగిన భారతి పరువు హత్య కేసులో భయంకర నిజాలు బయటపడ్డాయి. గుంతకల్లు తిలక్‌నగర్‌కు చెందిన త్రండి తుపాకుల రామాంజనేయులే కూతురిని ఆత్మహత్యకు ఉసిగొల్పినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు ఈ మర్డర్ కేసులో రామాంజనేయులు పెద్దల్లుడు మారుతి హస్తం కూడా ఉన్నట్లు డీఎస్పీ ఎ.శ్రీనివాసులు తెలిపారు. భారతి తండ్రితోపాటు ఆమె బావను అరెస్ట్ చేయగా కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Also Read: 'రాబిన్ హుడ్' కోసం హాట్ బ్యూటీని దించారుగా..!

ఈ మేరకు డీఎస్సీ తెలిపిన వివరాల ప్రకారం.. తిలక్‌నగర్‌కు చెందిన రామాంజనేయులుకు భార్య, నలుగురు కూతుళ్లు ఉన్నారు. తిలక్ నగర్ లోనే టిఫెన్‌ సెంటర్‌ నడిపిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న చిన్న కూతురు భారతి.. అదే గ్రామానికి చెందిన యశ్వంత్‌ అనే అబ్బాయిని 5ఏళ్ల నుంచి ప్రేమిస్తోంది. ఇంట్లో తెలియడంతో తల్లిదండ్రులు హెచ్చరించారు. మరో కులం కాబట్టి మనకు కుదరదని, మంచిమాటతో చెప్పినపుడు మానుకోవాలన్నారు. అయినా భారతి వినలేదు. చస్తానుగాని యశ్వంత్‌ను మరచిపోనని చెప్పింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన తండ్రి రామాంజేయులు.. కూతురిని చంపాలని ఫిక్స్ అయ్యాడు. ఆటో డ్రైవర్ అయిన తన పెద్ద అల్లుడు మారుతి సాయంతో హత్యకు ప్లాన్ చేశాడు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు