Eluru: ఏలూరులో ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే 30 మంది!

ఏలూరులో ఆశ్రమం హాస్పిటల్ సమీపంలో ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 30 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

New Update

ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఆశ్రమం హాస్పిటల్ సమీపంలో ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 30 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు వెంటనే ఘటనా స్థలం చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం

ఊపిరాడక నలుగురు..

ఇదిలా ఉండగా ఇటీవల మహారాష్ట్రలో నలుగురు కార్మికులు మృతి చెందారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో వాటర్‌ ట్యాంక్‌ క్లీన్‌ చేస్తుండగా ఊపిరాడక నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నాగ్‌పాడలోని నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్‌పై ఉన్న వాటర్ ట్యాంక్‌ను ఐదుగురు కూలీలు శుభ్రం చేయడానికి లోపలికి దిగారు. దీంతో ఊపిరాడక వారు అస్వస్థతకు గురయ్యారు. ఆ వాటర్‌ ట్యాంకులోనే ఉండిపోయారు.

ఇది కూడా చూడండి: HYD: హైదరాబాద్ లో మిన్నంటిన సంబరాలు..పోలీసుల లాఠీ ఛార్జ్

ఈ విషయం తెలుసుకున్న ముంబై అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అంబులెన్స్‌లు, బీఎంసీ వార్డు అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఊపిరాడక అచేతనంగా పడిపోయిన ఐదుగురిని వాటర్‌ ట్యాంకు నుంచి బయటకు తీశారు. అంబులెన్స్‌ల్లో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నలుగురు కూలీలు మరణించినట్లు డాక్టర్లు నిర్థారించారు. ఒక వ్యక్తికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: ind vs nz: భారత్ vs న్యూజిలాండ్ మ్యాచ్.. హైలైట్స్ ఇవే!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు