ఆదిలాబాద్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి
ఆదిలాబాద్లో ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. బస్సులోని పలువురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
విశాఖలో దారుణం.. ఎన్ఆర్ఐ మహిళ అనుమానాస్పద మృతి
విశాఖలో ఎన్ఆర్ఐ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. అమెరికాలో స్థిరపడిన మహిళ ఓ స్థలం లీజ్ అగ్రిమెంట్ కోసం అమెరికా నుంచి వచ్చి శ్రీధర్ అనే వ్యక్తితో హోటల్లో ఉంటుంది. సడెన్గా ఆమె ఉరివేసుకుంది. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
AP Crime: తలదూర్చిందని తల నరికేశాడు.. ఏపీలో ఉమెన్స్ డే రోజు దారుణం!
ఉమెన్స్ డే రోజే ఏపీలో ఘోరం జరిగింది. ముమ్మిడివరం అనాతవరంలో మాలతి అనే పక్కింటి మహిళపై జయ రామకృష్ణ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. పిల్లల గొడవలే ఇందుకు కారణం కాగా మాలతి తల లోతుగా తెగింది. ఆమెను అస్పత్రికి తరలించి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
🔴Live Breakings: స్టార్ షిప్ ఎఫెక్ట్.. 240 విమానాల రాకపోకలకు అంతరాయం
వైరల్ | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | క్రైం
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో పేలిన మందుపాతర... యువతికి తీవ్ర గాయాలు
ఛత్తీస్గఢ్లో మందుపాతర పేలి మహిళకు తీవ్రగాయాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో బీజాపూర్ జిల్లా రాంపురం గ్రామానికి చెందిన కుంజ పాండే అనే యువతి కాలుతోపాటు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.
Khammam: ఐ లవ్ యూ బంగారం తిన్నావా.. రమ్మంటావా: లెక్చరర్ సైకో చేష్టలు!
ఖమ్మంలో దారుణం జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికను ప్రేమ పేరిట లెక్చరర్ వేధింపులకు గురిచేయడం కలకలం రేపుతోంది. ఐ లవ్ యూ బంగారం. తిన్నావా, పడుకున్నావా, రమ్మంటావా అంటూ సైకో చేష్టలకు పాల్పడిన హరిశంకర్ను అరెస్ట్ చేసి ఫొక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.
షాద్నగర్లో దారుణం.. ఏకంగా పోలీస్ స్టేషన్లోనే గొంతు కోశాడు!
షాద్నగర్లో దారుణం జరిగింది. పోలీస్ స్టేషన్లో ప్రేమజంటపై హత్యాయత్నం చేశాడో దుండగుడు. పోలీసులు చూస్తుండగానే బ్లేడుతో గొంతు కోశాడు. పోలీస్ స్టేషన్లోనే తమకు రక్షణ లేకపోతే ఇక బయట తమ పరిస్థితి ఎలా ఉంటుందంటూ ప్రేమికులు వాపోతున్నారు.
AP Crime: అయ్యో అశ్విని.. ఎంత పని చేశావమ్మా.. బాధలు బరించలేనంటూ రాసి..!
అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో గిరిజన బాలికల హాస్టల్లో ఉరేసుకుని విద్యార్థిని బలవన్మరణంకు పాల్పడింది. అశ్విని చనిపోయే ముందు రెండు అక్షరాలతో చివరి మాట డోరి నాగసూర్య, అక్క, చెల్లిలను జాగ్రత్తగా చూసుకో అంటూ కన్నీటి పర్యాంతంగా సూసైడ్ నోట్ రాసింది.