/rtv/media/media_files/2026/02/09/pics-2026-02-09-14-36-32.jpg)
బెంగళూరు(bengaluru) లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. చదువు కోసం మొబైల్ కావాలని అడిగిన కూతురికి(daughter) నమ్మకంతో తల్లిదండ్రులు ఫోన్ కొనిస్తే, ఆ అమ్మాయి మాత్రం దాన్ని దారుణమైన పనులకు వాడుకుంది. సొంత కుటుంబ సభ్యుల పరువు తీసేలా వారి వ్యక్తిగత ఫోటో(private photos) లను తీసి తన ప్రియుడికి పంపించింది. చివరకు ఈ విషయం ఇంట్లో తెలియడంతో తల్లిదండ్రులే పోలీసులను ఆశ్రయించారు.
అసలు విషయం ఏమిటంటే.. బెంగళూరు(karnataka) లోని బ్యాటరాయనపురలో నివసించే ఒక యువతి, కాలేజీ చదువుకు మొబైల్ అవసరమని తన తల్లిదండ్రులను కోరింది. వారు కూడా ఆమెను నమ్మి ఫోన్ కొనిచ్చారు. అయితే కొన్నాళ్ల నుంచి ఆ అమ్మాయి ప్రవర్తనలో మార్పు రావడం, ఎప్పుడూ ఎవరో అపరిచిత యువకుడితో ఫోన్‌లో మాట్లాడుతుండటం తల్లి గమనించింది. అనుమానం వచ్చి ఒకరోజు కూతురి మొబైల్‌ను చెక్ చేయగా, అందులో ఉన్న ఫోటోలు చూసి ఆమె గుండె ఆగినంత పనైంది.
Also Read : భారీ ఆన్ లైన్ గేమింగ్ స్కామ్ గుట్టు రట్టు... దుబాయ్ కేంద్రంగా రూ. 5,000 కోట్ల భారీ కుంభకోణం
పెద్దమ్మ స్నానం చేస్తున్నప్పుడు
ఆ యువతి తన తల్లి నిద్రపోతున్న సమయంలో ఆమెకు తెలియకుండా శరీర భాగాలను ఫోటోలు తీసింది. అంతటితో ఆగకుండా, తన పెద్దమ్మ స్నానం చేస్తున్నప్పుడు ఆమెకు తెలియకుండా నగ్నంగా ఉన్న ఫోటోలను రహస్యంగా క్లిక్ చేసింది. ఈ ఫోటోలన్నింటినీ వరుణ్ అలియాస్ గిరిధర్ అనే తన ప్రియుడికి వాట్సాప్‌లో పంపించింది. మొబైల్ చెక్ చేయకపోయి ఉంటే ఈ విషయం ఎప్పటికీ బయటపడేది కాదు.
వెంటనే తల్లిదండ్రులు ఆ ఫోటోలను డిలీట్ చేయించి, కూతురిని మందలించారు. కానీ ఆ ఫోటోలు అప్పటికే ప్రియుడి దగ్గరకు వెళ్ళిపోవడంతో, రేపు పొద్దున వాడు వాటిని బయట పెట్టి బ్లాక్‌మెయిల్ చేస్తాడేమో అన్న భయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి, ఆ యువతిని, ఆమె ప్రియుడిని విచారిస్తున్నారు. పిల్లల చేతికి ఫోన్ ఇచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఘటన మరోసారి తల్లిదండ్రులను హెచ్చరిస్తోంది.
Also Read : suicide : సైబర్ నేరగాళ్ల వేధింపులు.. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి
Follow Us