/rtv/media/media_files/2026/02/09/kannada-2026-02-09-15-15-46.jpg)
కర్ణాటకలో సంచలనం సృష్టిస్తున్న జ్యోతిషుడు కమలాకర్ భట్ కేసులో విస్తుపోయే విషయలు వెలుగులోకి వస్తున్నాయి. అతనితో అక్రమ సంబంధం కోసం భర్తనే చంపించాలని చూసిన కేసులో అరెస్టయిన సుచిత్ర గురించిన సంచలన నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఉత్తర కన్నడ జిల్లా సిద్ధాపురానికి చెందిన ఈమె చుట్టూ ఇప్పుడు మరిన్ని వివాదాలు ముసురుకుంటున్నాయి. పోలీసులు జరుపుతున్న విచారణలో ఆమె యువకులను ఎలా బుట్టలో వేసుకునేదో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
పెళ్లి సర్టిఫికెట్ ప్రకారం ఈమె అసలు పేరు సురేఖ. కానీ, యువకులను ఆకర్షించడానికి తన పేరును సుచిత్రగా మార్చుకుంది. సోషల్ మీడియాలో కొత్త పరిచయాలు పెంచుకోవడానికి ఇది ఆమె వేసిన మొదటి ఎత్తుగడ. యువకులు తన బుట్టలో పడటం కోసం సుచిత్ర ఒక వింత కథ అల్లేది.
సురేఖ అనేది నా ట్విన్ సిస్టర్ (కవల సోదరి) పేరు. ఆమె చనిపోయింది, ఇప్పుడు ఆమె పిల్లలను నేనే చూసుకుంటున్నాను. నాకు ఇంకా పెళ్లి కాలేదని అబద్ధాలు చెప్పేది. ఈ మాటలు నమ్మి చాలామంది యువకులు ఆమెకు దగ్గరయ్యేవారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, చూడటానికి బాగున్న యువకుల ఫోటోలపై కామెంట్స్ చేస్తూ సుచిత్ర పరిచయం పెంచుకునేది.
మెసెంజర్‌లో రెండు మూడు నెలల పాటు నిరంతరం చాటింగ్ చేస్తూ వారి నమ్మకాన్ని గెలుచుకునేది. ఆ అబ్బాయిల ఆర్థిక పరిస్థితి ఏంటి? వెనక ముందు ఎవరున్నారు? అనే విషయాలను చాటింగ్‌లోనే గుంజేసేది. ఒకసారి చనువు పెరిగిన తర్వాత నిన్ను కలవాలని ఉంది అంటూ వారిని తన ఇంటికి పిలిపించుకునేది.
విచారణలో మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ఈమెకు కేవలం జ్యోతిషి కమలాకర్ భట్‌తోనే కాదు, కలబురగికి చెందిన ఒక పెద్ద జమీందారుతో కూడా సంబంధం ఉన్నట్లు పోలీసుల తనిఖీల్లో తేలింది. ఆమె మొబైల్ ఫోన్ డేటాను విశ్లేషించిన పోలీసులకు ఇలాంటి ఎన్నో 'లవ్ స్టోరీలు' బయటపడ్డాయి.
పోలీసులు సుచిత్ర కాల్ డేటా, సోషల్ మీడియా అకౌంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆమె ఇంకా ఎంతమందిని ఇలా మోసం చేసింది? ఈ హత్య వెనుక ఇంకా ఎవరి హస్తం ఉంది? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈమె చేతిలో మోసపోయిన మరికొందరు యువకులు ఇప్పుడు పోలీసులను సంప్రదిస్తున్నారు. పరువు పోతుందన్న భయంతో ఇప్పటివరకు బయటకు రాని వారు, ఈ కేసు తీవ్రత చూసి ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తున్నారు. కలబురగి జమీందారుతో పాటు మరికొందరు వ్యాపారవేత్తలు కూడా ఈమె మాయలో పడినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సుచిత్ర, కమలాకర్ భట్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. బెయిల్ కోసం వారు చేసిన ప్రయత్నాలను కోర్టు తోసిపుచ్చింది. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్నందున వారిని జైల్లోనే ఉంచి విచారణ కొనసాగిస్తున్నారు.
Follow Us