Crime: ప్రియుడ్ని ఇంటికి పిలిచి స్క్రూ డ్రైవర్‌తో చంపిన మహిళ

ఈ మధ్య వివాహేతర సంబంధాలు హత్యలకు దారి తీస్తున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం వెలుగుచూసింది. ఓ మహిళ వివాహేతర సంబంధం కొనసాగించడమే కాక.. ప్రియుడ్ని ఇంటికి పిలిచి హత్య చేయడం కలకలం రేపింది.

New Update
Woman Calls Lover Home, Joins Husband In Killing Him With Screwdriver in Uttar Pradesh

Woman Calls Lover Home, Joins Husband In Killing Him With Screwdriver in Uttar Pradesh

ఈ మధ్య వివాహేతర సంబంధాలు హత్యలకు దారి తీస్తున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం వెలుగుచూసింది. ఓ మహిళ వివాహేతర సంబంధం కొనసాగించడమే కాక.. ప్రియుడ్ని ఇంటికి పిలిచి హత్య చేయడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. అనిష్ (45) అనే వ్యక్తికి సితార అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఇటీవల అతడి నుంచి సితార రూ.7 లక్షలు అప్పు తీసుకుంది. 

Also Read: తీసుకున్న సొంత గొయ్యిలో పడ్డ పాకిస్తాన్.. 2 నెలల్లో రూ.1,240 కోట్లు నష్టం

ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని అనిష్.. సితారను అడిగాడు. ఆమె ఇవ్వలేదు. పదేపదే అడగటంతో ఆమె విసుగుచెందింది. చివిరికి ఆమె అప్పు తీసుకున్న విషయం భర్త రాయిస్‌ అహ్మద్‌కు తెలిసింది. దీంతో వీళ్లద్దరూ కలిసి అనిష్‌ హత్యకు ప్లాన్ వేశారు. దీంతో ఓ రోజు సితార అనిష్‌ను ఇంటికి పిలిచింది. అతడు వచ్చాక తాడుతో కట్టేశారు. స్క్రూ డ్రైవర్, ఇతర వస్తువుల సాయంతో అనిష్‌ను దారుణంగా హత్య చేశారు. 

Also Read: అమెరికా పతనం మొదలైంది..సుంకాల తర్వాత వాల్ మార్ట్ లో ధరల పెరుగుదల

సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సితార, రాయిస్ అహ్మద్‌ దంపతులను అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే ఈ హత్యకు వివాహేత సంబంధమే కారణమని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్పారు. సితారా ఇంటికి అనిష్ తరచు వస్తుండేవాడని.. అతడి అడ్డు తొలగించుకోవాలని సితార భావించినట్లు తెలిపారు. ఇందుకోసం అతడిని ఇంటికి పిలిపించి హత్య చేసినట్లు పేర్కొన్నారు. పూర్తిస్థాయి విచారణ తర్వాత మరిన్ని విషయాలు చెబుతామన్నారు. 

Also read: పల్నాడు లో ర్యాగింగ్ కలకలం.. కర్రలతో కొడుతూ.. కరెంట్ షాక్ పెడుతూ! వీడియో వైరల్

మరోవైపు అనిష్ కుటుంబ సభ్యులు సితారతో అతడికి వివాహేతర సంబంధం ఉన్న విషయం తమ తెలియదంటున్నారు. ఆమె మా కుటుంబానికి తెలుసని.. ఇటీవల అనిష్ నుంచి రూ.7 లక్షలు అప్పు తీసుకున్నట్లు తెలిపారు. తమ కొడుకు డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగినందుకే హత్య చేశారని ఆరోపిస్తున్నారు. ఇటీవలే తన కొడుకు పెళ్లి ఖరారైందని.. ఈ క్రమంలోనే అప్పు అడగడానికి వెళ్తున్నట్లు చెప్పి బయటకు వెళ్లాడని చెప్పారు. చివరికి అతడిని పొట్టనపెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: పాపం..పెళ్లైన రెండు రోజులకే గుండెపోటుతో వరుడు మృతి

గత కొంతకాలంగా భార్య-భర్తలు, ప్రియుడు-ప్రియురాలు మధ్య జరిగే గొడవలు హత్యలకు దారి తీస్తున్నాయి. అంతేకాదు ప్రియుడి కోసం భర్తలను భార్యలు హత్య చేసిన ఘటనలు కూడా చాలానే జరిగాయి. దీంతో వివాహ సంబంధాలపై ప్రస్తుత కాలంలో యువత భయాందోళన చెందుతున్నారు. వరుసగా ఇలాంటి దారుణాలు చోటుచేసుకోవడం కలకలం రేపుతున్నాయి. ఇలాంటి  నేరాలను అరికట్టేందుకు సామాజిక అవగాహన, కుటుంబాల్లో కౌన్సెలింగ్, మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం అవసరం ఉంటుంది . 

Advertisment
తాజా కథనాలు