Punjab: 405 రోజులు... 10 దేశాలు... 41 లక్షల రూపాయలు.. చేరిన గమ్యం.. కానీ అంతలోనే!

అమెరికాకు వెళ్లాలన్న కలను సాకారం చేసుకోవడానికి మణిందర్‌ పాల్ 405 రోజుల పాటు కష్టపడ్డాడు.10 దేశాల సరిహద్దులను దాటాడు. రూ.41 లక్షలు ఖర్చు పెట్టాడు. కానీ తన గమ్యస్థానం చేరుకోగానే సీన్‌ అంతా రీవర్సై అరెస్ట్ అయ్యాడు. అతని కన్నీటి కథ ఈ ఆర్టికల్ లో..

New Update
usa

Second Batch Flight Landed In Amrithsar

గమ్యస్థానాన్ని చేరుకోవాలనే మక్కువతో అతను నడుస్తూనే 10 దేశాల సరిహద్దులను దాటాడు. తన కలను నెరవేర్చుకోవడానికి మొత్తం రూ.41 లక్షలు ఖర్చు పెట్టాడు. కానీ తన గమ్యస్థానంలో అడుగు పెట్టగానే తన అదృష్టం తొలగిపోతుందని, కలలో కూడా ఊహించనిది జరుగుతుందని అతనికి తెలియదు. అంతేకాకుండా డబ్బు, కలలు అన్నీ ఒక్క దెబ్బలో మాయం అయిపోయాయి.

Also Read:  Viral News:రిసెప్షన్‌కు ముందు బ్యూటీపార్లర్‌కు వెళ్లొస్తానని..ప్రియుడితో జంప్‌ అయిన నవవధువు!

అవును, ఇది పంజాబ్‌లోని జలంధర్‌ (Jalandhar) లోని పట్టి మలేషియాలో నివసించే 20 ఏళ్ల మణీందర్ పాల్ సింగ్ కథ. మణీందర్ పాల్ సింగ్ కూడా అందరిలానే అమెరికా వెళ్లి అక్కడ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కలలు కన్నాడు. తన కలను నిజం చేసుకోవడానికి, మణీందర్ అక్టోబర్ 2023లో తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ముందుగా ఆయన ఢిల్లీ నుండి కజకిస్తాన్ చేరుకున్నాడు. కొన్ని రోజులు కజకిస్తాన్‌లో ఉన్న తర్వాత, అతను దుబాయ్‌కు బయలుదేరాడు.

Also Read: Yadagiri Gutta: స్వర్ణ విమాన గోపురం రికార్డు.. దేశంలోనే మొట్టమొదటిదిగా యాదగిరిగుట్ట ఆలయం రికార్డు!

Manidhar Pal Singh Story

దుబాయ్ నుండి అతన్ని లిబియాకు వెళ్లాడు. తరువాత లిబియా నుండి సెనెగల్ చేరుకున్నాడు. దీని తరువాత, అతను లిబియా, నికరాగ్వా, హోండురాస్,  గ్వాటెమాల మీదుగా మెక్సికో చేరుకున్నాడు. ఈ దేశాల సరిహద్దులు దాటడానికి మణీందర్‌కు దాదాపు 13 నెలలు పట్టింది. అక్టోబర్ 2023లో ప్రారంభమైన మణీందర్ అమెరికా ప్రయాణం దాదాపు ఒక సంవత్సరం తర్వాత 2024 నవంబర్‌లో మెక్సికో ద్వారా అమెరికా చేరుకున్నాడు. అక్కడితో తన జీవితాశయం నెరవేరింది అనుకున్నాడు.

కానీ అక్కడే ఉంది అసలైన విషయం. మణీందర్‌ అమెరికా చేరుకున్న వెంటనే, తన ఏజెంట్ సలహా మేరకు తన పాస్‌పోర్ట్‌లోని అన్ని పేజీలను చింపేశాడు. అందులో వివిధ దేశాల నకిలీ వీసాలు కూడా ఉన్నాయి. దీని తరువాత, మణీందర్ దురదృష్టం అతన్ని అమెరికా భద్రతా సంస్థల వద్దకు తీసుకెళ్లింది. ఆ తర్వాత, అమెరికా భద్రతా సంస్థ మణీందర్‌ను అరెస్టు చేసి నిర్బంధ కేంద్రానికి పంపింది. దాదాపు రెండు నెలల పాటు నిర్బంధ కేంద్రంలో ఉంచిన తర్వాత, అతన్ని ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయానికి తిప్పి పంపారు.

ఐజీఐ విమానాశ్రయం డీసీపీ ఉషా రంగనాని ప్రకారం, అమెరికా నుండి అక్రమవలసదారుడిగా ఉన్న మణీందర్ పాల్ సింగ్‌ (Manindhar Pal Singh) ను భారత కోర్టు (Indian Court) సెక్షన్లు 318(4)/319(2)/336(3)/340(2)/238(C) ,  పాస్‌పోర్ట్ చట్టంలోని సెక్షన్ 12 కింద అరెస్టు చేశారు. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి SHO సునీల్ గోయల్ నేతృత్వంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. 

Also Read:Shikhar Dhawan: కొత్త ప్రేయసితో శిఖ‌ర్ ధావ‌న్‌.. ఆమె ఎవ‌రో తెలుసా..

Also Read:  Trump-Musk:మస్క్‌ కుమారుడి అల్లరి వల్ల 145 సంవత్సరాల డెస్క్‌ మార్చేసిన ట్రంప్‌!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు