కులగణనపై రేవంత్ రెడ్డి బీసీ నేతలతో సమావేశం అయ్యారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మేరకు చిత్తశుద్ధితో బీసీ కులగణన చేపట్టామన్నారు. బీజేపీకి ప్రేమ ఉంటే కేంద్రం వద్ద ఉన్న కులాల లెక్కలను బయటపెట్టాలని రేవంత్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ ఆ బాధ్యత తీసుకోవాలన్నారు. కేసీఆర్ గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీల లెక్క 51 శాతమేనన్నారు. కేసీఆర్ బీసీలను తగ్గిస్తే తాను పెంచానన్నారు. తెలంగాణలో బీసీ కులగణను చూసి బీజేపీ భయపడుతోందన్నారు. దేశం అంతా అమలు చేయాల్సి వస్తుందేమోనని బీజీపీ కుట్ర చేస్తోందని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. తాము బీసీ కులగణన పక్కాగా చేశామని.. ఇది దేశానికి రోల్ మోడల్ అని అన్నారు. సర్వే రాహుల్ గాంధీ తమకు ఇచ్చిన ఆస్తి అని.. దీన్ని కాపాడుకోకపోతే మనకే నష్టమని బీసీ నేతలకు రేవంత్ స్పష్టం చేశారు. లెక్కలు తప్పు అని చెబుతున్న వారు ఎక్కడ తప్పు ఉందో చూపించాలని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి.
ఇది కూడా చదవండి: SLBC Accident: శ్రీశైలం ప్రమాదానికి కారణం అదే.. ఆ ఏడుగురు ఎక్కడ?: మంత్రి ఉత్తమ్ షాకింగ్ ప్రకటన!
Rahul Gandhi is planning to go around country with Telangana model of caste census
— Congress for Telangana (@Congress4TS) February 22, 2025
కులగణన సర్వే చేస్తా అని రాహుల్ గాంధీ మాట ఇచ్చాడు..
గాంధీ కుటుంబం మాట ఇస్తే ఏ త్యాగానికైనా సిద్ధం అవుతుంది గాని మాట తప్పదు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
• @revanth_anumula #RevanthReddy pic.twitter.com/NPbMWrMTjp
రాహుల్ మాట ప్రకారమే కులగణన..
తెలంగాణలో అధికారంలోకి రాగానే కులగణన చేసి తీరుతామని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో మాట ఇచ్చారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే తప్పదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన నిర్వహించామన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలాంటి సాహసం చేయలేదన్నారు. కానీ తెలంగాణలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం అందరి భాగస్వామ్యంతో కులగణన నిర్వహించామన్నారు. సమగ్ర కుటుంబ సర్వే తప్పుల తడకగా ఉందనే.. ఆనాటి ప్రభుత్వం లెక్కలను బయటపెట్టలేదన్నారు రేవంత్ రెడ్డి. అందుకే ఆ వివరాలను ఎన్నికల కోసం వాడుకున్నారు తప్పా.. ప్రజల కోసం వినియోగించలేదన్నారు. కానీ తాము చిత్తశుద్ధితో కులగణనపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు రేవంత్ రెడ్డి. చట్టపరంగా ఇబ్బందులు కలగకుండా ప్లానింగ్ డిపార్ట్ మెంట్ కు అప్పగించి కులగణను పకడ్బందీగా నిర్వహించామన్నారు.
ఇది కూడా చదవండి: Koneru Konappa: సీఎం రేవంత్ తో కోనేరు కోనప్ప భేటీ.. ఆ హామీ ఇస్తేనే పార్టీలో ఉంటానని కండీషన్?
ఇంటింటికీ ఎన్యూమరేటర్లను పంపి సమాచారాన్ని సేకరించామన్నారు. సేకరించిన సమాచారాన్ని తప్పులు దొర్లకుండా ఎన్యూమరేటర్ సమక్షంలో కంప్యూటరీకరించినట్లు వివరించారు. తప్పులు జరిగాయని మాట్లాడుతున్న వారు ఏ బ్లాక్ లో ఎక్కడ తప్పు జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రక్రియను తప్పుబట్టడం ద్వారా మొత్తం వ్యవస్థను కుప్పకూల్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ విషయాన్ని బీసీ సోదరులు గమనించాలన్నారు. స్వతంత్ర భారత దేశంలో ఎవ్వరూ ఇప్పటివరకు కులగణన చేపట్టలేదన్నారు. ఒక్కసారి బీసీల లెక్క తెలిస్తే వాటా అడుగుతారనే దీనిపై కొందరు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎంతోకాలంగా ఉన్న డిమాండ్ ను మనం విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ లో ముస్లింలు ఓబీసీ కేటగిరీలో ప్రయోజనం పొందుతున్నారన్నారు.
కానీ బండి సంజయ్ మాత్రం రేవంత్ రెడ్డి బీసీలలో ముస్లింలను కలిపారని చెబుతున్నాడని ఫైర్ అయ్యారు. భవిష్యత్ లో దేశంలో బీసీ రిజర్వేషన్ల గురించి చర్చించాలంటే తెలంగాణ గురించి, రేవంత్ రెడ్డి గురించి చర్చించుకునే పరిస్థితి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని జారవిడుచుకుంటే చరిత్ర క్షమించదన్నారు. దీన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత బీసీ నేతలందరిపై ఉందన్నారు. పకడ్బందీ ప్రక్రియతో కులగణన చేశామన్నారు. దీన్ని కాపాడుకుని ప్రజల్లోకి తీసుకెళ్లండని బీసీ నేతలకు పిలుపునిచ్చారు. కులగణన ప్రక్రియ పూర్తి చేయడంతో తన బాధ్యత పూర్తయిందన్నారు. దీన్ని పట్టాలెక్కించి గమ్యం చేర్చే వరకు ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీదేనని దిశా నిర్దేశం చేశారు. జనగణనలో కులగణన చేర్చాలని బీజేపీకి సవాల్ విసిరారు. తద్వారా ఎవరి లెక్క తప్పో తేలుతుందన్నారు.
జనగణనలో కులగణన చేర్చాలని ఈ సమావేశం వేదికగా తీర్మానం చేస్తున్నామన్నారు. సామాజికవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి మార్చి 10 లోగా తీర్మానాలు చేయాలన్నారు. బీసీలంతా తమ ఐకమత్యాన్ని చాటాలని పిలుపునిచ్చారు. అప్పడే ఆయా వర్గాల వారికి రాజకీయంగా, విద్య ఉద్యోగాల పరంగా ప్రయోజనం ఉంటుందన్నారు. బలహీన వర్గాలకు కులగణన నివేదికే బైబిల్, భగవద్గీత, ఖురాన్ అని అభివర్ణించారు రేవంత్ రెడ్డి.