Boat Capsized: పడవ బోల్తా.. ఒకరు మృతి - ఎనిమిది మంది గల్లంతు

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బహ్రైచ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇండియా-నేపాల్ సరిహద్దులో ఉన్న కౌడియాలా నదిలో 22 మందితో ప్రయాణిస్తున్న ఒక పడవ బోల్తా పడింది. ఈ విషాద ప్రమాదంలో ఒక మహిళ మరణించగా.. మరో 13 మందిని రక్షించారు. ఇందులో ఇంకో ఎనిమిది మంది గల్లంతయ్యారు. 

New Update
bahraich boat Capsized

bahraich boat Capsized

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బహ్రైచ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇండియా-నేపాల్ సరిహద్దులో ఉన్న కౌడియాలా నదిలో 22 మందితో ప్రయాణిస్తున్న ఒక పడవ బోల్తా(boat-capsized) పడింది. ఈ విషాద ప్రమాదంలో ఒక మహిళ మరణించగా.. మరో 13 మందిని రక్షించారు. ఇందులో ఇంకో ఎనిమిది మంది గల్లంతయ్యారు. 

Also Read :  నవంబర్‌లో సెలవులే సెలవులు.. మొత్తం ఎన్నంటే..?

Bahraich Boat Capsized

సమాచారం అందుకున్న జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ndrf), సశస్త్ర సీమా బల్ (ssb) బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అనంతరం గల్లంతైన వారి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. కాగా ప్రస్తుతం తీవ్రమైన వర్షాల కారణంగా నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రెస్క్యూ బృందానికి కాస్త సవాలుగా మారిందనే చెప్పాలి. 

Also Read :  ఘోర ప్రమాదం! కారు కింద మూడేళ్ల బాలిక.. వణుకుపుట్టిస్తున్న వీడియో

కాగా సుజౌలీ ప్రాంతంలోని భర్తాపూర్ గ్రామానికి చెందిన దాదాపు 22 మంది గ్రామస్థులు ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. అది పూర్తయ్యాక వారు తిరిగి తమ స్వగ్రామానికి తిరిగి పడవలో కౌడియాలో నది గుండా ప్రయాణించారు. ఈ క్రమంలో నదిలో నీటి ఉధృతి ఎక్కువైనట్లు సమాచారం. దీంతో నదిలో వేగంగా ప్రవహిస్తున్న నీటి కారణంగా పడవ బోల్తా పడి ఈ ఘోరమైన విషాదం జరిగినట్లు తెలుస్తోంది. అప్పుడే ఈ ఘటనను చూసిన కొందరు స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. పడవలో ఉన్న 22 మందిలో సుమారు 13 మందిని కాపాడగలిగారు. కానీ ఒక మహిళ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయింది. 

Advertisment
తాజా కథనాలు