Viral Video: ఘోర ప్రమాదం! కారు కింద మూడేళ్ల బాలిక.. వణుకుపుట్టిస్తున్న వీడియో

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో భయంకరమైన ఘటన వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.  ఈ వీడియోలో ఒక మైనర్ బాలుడు కారు నడుపుతూ .. రోడ్డుపై ఆడుకుంటున్న  మూడేళ్ళ చిన్నారి మీద నుంచి  దూసుకెళ్లాడు.

New Update
Ahmedabad incident

Ahmedabad incident

Viral Video:  గుజరాత్ లోని అహ్మదాబాద్ లో భయంకరమైన ఘటన వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.  ఈ వీడియోలో  ఒక మైనర్ బాలుడు కారు నడుపుతూ .. రోడ్డుపై ఆడుకుంటున్న  మూడేళ్ళ చిన్నారి మీద నుంచి  దూసుకెళ్లాడు. అదృష్టవశాత్తు..  ఈ ప్రమాదంలో చిన్నారి కారు చక్రాల కిందకు వెళ్లకుండా.. మధ్యలోనే ఉండడంతో తృటిలో ప్రమాదం తప్పింది. కారు ఢీకొట్టడం వల్ల చిన్నారికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఈ సంఘటన మొత్తం అక్కడి సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. బాలుడి అజాగ్రత్త, అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

బాలుడి పై పోలీస్ కేసు 

ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ కావడంతో.. పోలీసులు వెంటనే స్పందించారు. రూల్స్  ఫాలో అవ్వకుండా ప్రమాదకర రీతిలో కారు నడిపి చిన్నారికి గాయాలు చేసినందుకు సదరు బాలుడిపై కేసు నమోదు చేశారు. అలాగే బాలుడు మైనర్ కావడంతో తల్లిదండ్రుల పై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే..   మైనర్లను డ్రైవింగ్ చేయడానికి అనుమంతించడం చట్టరీత్యా నేరం.

Also Read: Devilish lover : వీడో పైశాచిక లవర్..  వేలు గోర్లు కత్తిరించి..ఆపై లైంగిక దాడి

Advertisment
తాజా కథనాలు