Boat Capsized: గంగా నదిలో పడవ బోల్తా ఇద్దరు రైతులు గల్లంతు
బీహార్లోని మానేర్ జిల్లా మహావీర్ తోలా గ్రామంలో ఈరోజు ఉదయం గంగా నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. కాగా బోటులో మొత్తం 12 మంది రైతులు ప్రయాణించినట్లు చెప్పారు. అందులో ఇద్దరు గల్లంతు అయ్యారని.. మిగతా వారు ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చారని పోలీసులు తెలిపారు.