/rtv/media/media_files/2025/01/16/tkU7K6KrfTpiBGfaPeJ2.jpg)
Gold
తిరుపతిలో శనివారం అర్థరాత్రి భారో చోరీ జరిగింది. కొందరు దొంగలు ఏకంగా ఇళ్లను బద్దలు కొట్టి బంగారం కొట్టేశారు. 1.048 కిలోల బంగారాన్ని దోచుకున్నారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా ఉన్న నాలుగు ఇళ్లపై కేటుగాళ్లు దాడి చేసి డబ్బులు తీసుకెళ్లారు. అర్ధరాత్రి సమయంలో ఓ విల్లా సోలార్ ఫెన్సింగ్ కట్ చేసి లోపలికి ప్రవేశించారు. వరసగా 80, 81, 82, 83 విల్లాల్లో చోరీకి ప్రయత్నించారు.
ఇది కూడా చూడండి: CM Chandrababu: ఇలాంటి బావమరిది దొరకడం నా అదృష్టం.. చంద్రబాబు ఎమోషనల్!
రెండు విల్లాల నుంచి..
81వ విల్లాలోని యజమాని మేఘనాథ్ రెడ్డి నిద్రిస్తుండగా వారి ఇంటి నుంచి కేజీ బంగారాన్ని దోచేశారు. 82వ విల్లాలో కేశవుల నాయుడు అనే వ్యక్తికి చెందిన ఇంట్లో 48 గ్రాముల బంగారం తీసుకెళ్లారు. బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంత సెక్యూరిటీ ఉన్న ఇంట్లోనే దొంగలు దోచుకున్నారంటే.. సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Jayalalitha: జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికే...సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు!
ఇదిలా ఉండగా వైసీపీ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటిపై ఓ యువకుడు దాడి చేశాడు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ నివాసం దగ్గర ఇవాళ ఉదయం 3 గంటలకు ట్రాక్టర్ తో బీభత్సం సృష్టించి పార్కింగ్ చేసిన కారును ధ్వంసం చేశాడు. అనంతరం జై జనసేన అంటూ నినాదాలు చేశాడని స్థానికులు వెల్లడించారు. ఇంటి ముందు ర్యాంప్‌పై పార్క్ చేసిన కారును ట్రాక్టర్‌తో ఢీ కొట్టడంతో కారు ధ్వంసమైంది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా దాడిచేసిన యువకున్ని జనసేన కార్యకర్త గనిశెట్టి గంగాధర్‌గా గుర్తించారు.రూ.50వేలు ఇస్తానంటేనే దాడి చేశానని గంగాధర్ చెప్పినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: RC16: 20 ఏళ్ళు వెనక్కి వెళ్లి.. RC16 షూటింగ్ కోసం బుచ్చిబాబు పెద్ద ప్లానింగ్!