/rtv/media/media_files/2025/07/31/pigeons-2025-07-31-07-47-59.jpg)
Drone pigeons
కొందరు ఆకతాయిలు ఏదో రకంగా ప్రజల్ని భయాందోళనలను గురిచేస్తుంటారు. వాళ్ల శునకానందం కోసం పిచ్చి పిచ్చి చేష్ఠలకు పాల్పడుతుంటారు. పావురాలకు లైట్లు కట్టి.. రాత్రి సమయంలో వాటిని గాల్లోకి వదిలారు. అవి కాస్త డ్రోన్లు అంటూ భయపెట్టారు. దీంతో గ్రామస్తులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అలా రోజు గ్రామంలో ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తు్న్నారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజప్ఫర్‌నగర్‌లో చోటుచేసుకుంది.
ఈ పని చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రిపూట గుర్తుతెలియని డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయంటూ స్థానికంగా కొన్ని గ్రామాల్లో కొంతకాలంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఇదే విషయమై గ్రామస్థుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read : కోనసీమలో క్షుద్ర పూజల కలకలం.. 30 అడుగుల గొయ్యి తవ్వి..
Thugs Scared Villagers
🚨 Drone Pigeons" in Muzaffarnagar!
— زماں (@Delhiite_) July 30, 2025
Saqib & Shoaib turned pigeons into fake drones by tying red & green LED lights to their legs and flying them at night. Locals & cops chased "UFOs" for hours.
Both now arrested by UP Police. pic.twitter.com/esqpHea6cf
ఈ క్రమంలోనే షోయబ్, సాకీబ్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఓ గ్యాంగ్‌గా ఏర్పడి.. పావురాల కాళ్లకు చిన్న టార్చ్ లైట్లు కట్టి రాత్రిపూట వదులుతున్నట్లు వారు అంగీకరించారన్నారు. వాటినే ప్రజలు దూరం నుంచి చూసి డ్రోన్లుగా భావించారని చెప్పారు. నిందితుల వద్దనుంచి 2 పావురాలు, ఒక పంజరం, ఎరుపు, ఆకుపచ్చ ఎల్‌ఈడీ లైట్లను స్వాధీనం చేసుకుని.. వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కేసును ఛేదించిన పోలీసు బృందానికి రూ.20 వేల రివార్డు ప్రకటించారు.
Also Read : భద్రాచలంలో లవర్‌ను బెదిరించిన లాడ్జి సిబ్బంది
Viral News | latest-telugu-news | Uttar Pradesh | telugu crime news | national news in Telugu