/rtv/media/media_files/2025/05/31/E1To7BRycL1y9AM1RZ4M.jpg)
Occult Worship
AP Crime: కోనసీమ జిల్లా కొత్తపేటలో క్షుద్ర పూజల ఘటన కలకలం రేపింది. ఈ ఘటన గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర ఓ ఇంటిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఆ ఇంటి యజమాని రాత్రి ఓ రహస్య పూజా కార్యక్రమం నిర్వహించారు. పూజ కోసం ఇంటి మధ్యలో సుమారు 30 అడుగుల లోతైన గొయ్యిని తవ్వించాడు. దీనిని చూసి ఆందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గత కొన్ని రోజులుగా ఇంటి పరిసరాల్లో నిమ్మకాయలు, పసుపు, కుంకుమతో కూడిన పూజా సామగ్రిని గమనించారు. పక్కా ప్రణాళికతో.. రాత్రి కార్యక్రమం జరిగిందని చెబుతున్నారు.
గుప్త నిధుల కోసం తవ్వకాలు..
ఈ విషయం తెలిసిన వెంటనే కొత్తపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. ఇంటి యజమానిని, మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాధమికంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. గుప్త నిధుల కోసం ఈ తవ్వకాలు జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అమలాపురానికి చెందిన ఓ వ్యక్తి పూజల నిర్వహించినట్లు గుర్తించారు. అతడిని కూడా పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఇంటి యజమాని ఇచ్చిన సమాధానాలు పొంతన లేకుండా ఉండటంతో పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు.
ఇది కూడా చదవండి: స్పెర్మ్ టెక్ ఆఫీస్ సోదాల్లో షాకింగ్ దృశ్యాలు..డబ్బాల్లో వీర్యకణాలు..అండాలు
ఇటువంటి ఘటనలు గతంలో కూడా నమోదయ్యాయి. అయితే జనవాసాల మధ్యలో ఇలా బహిరంగంగా, పక్కా ప్రణాళికతో తవ్వకాలు చేయడం కొత్తపేట వాసులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ప్రజల భద్రతకు రక్షణ లేకుండా మారే ఈ తరహా కార్యకలాపాలను ఆపాలని ఇలా చేసిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురిపై కేసు నమోదు చేశారు. సంఘటన వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకునే దిశగా దర్యాప్తును చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: రూ.100 కోట్ల జీఎస్టీ ఎగవేత...కేషన్ ఇండస్ట్రీస్ పై కేసు
ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. అయినా గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి మూఢ నమ్మకాలను ఇంకా నమ్ముతున్నారు. ఏవేవో పూజలు, క్షుద్ర పూజలు వంటివి నిర్వహిస్తున్నారు. వీటి వలన ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలియదు కానీ చూసిన వారి మనోధైర్యం కోల్పోవడం తోపాటు అనేక అనుమానాలు వస్తున్నాయి. ప్రకృతిలో ప్రతి జీవికి కావాల్సిన అందు బాటుల్లో ఉంటున్నాయి. వాటిని పక్కన పెట్టి.. ఇలాంటి మూఢ నమ్మకాలను ఎందుకు నమ్ముతున్నారో అర్థం కవాటం లేదు. ఇక నుంచి అయినా ఇలాంటి వాటిని పక్కన పెట్టి మంచి మనో దైర్యంతో ఉండాలనే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అయితే కొన్ని ప్రకృతి నియమాల ప్రకారం.. ఇలాంటివి చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకొని చేయాలి. లేకపోతే మనుషులపై చెడు ప్రభావం ప్రమాదం ఉందని పండితులు చెబుతున్నారు. అందునకి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలి.
( AP Crime | ap-crime-news | ap crime latest updates )