/rtv/media/media_files/2025/07/31/lover-2025-07-31-07-53-28.jpg)
Bhadrachalam Crime News
Bhadrachalam Crime News: ప్రేమికుల ఎంజాయ్‌మెంట్ అంటే ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సమయం దొరికితే చాలు ఎక్కడో ఒక దగ్గరకు వెళ్లి ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తుంటారు. తాజాగా ఓ ప్రేమ జంటకు లాడ్జి సిబ్బంది పెద్ద షాకే ఇచ్చారు. అంతేకాదు వేధింపులకు గురి చేసి డబ్బులు తీసకుంటున్నారు. ఈ సంఘటన తెలంగాణలోని భద్రాచలంలో చోటు చేసుకుంది. స్థానిక సమాచారం ప్రకారం.. ఓ ప్రేమజంట లాడ్జిలో ఏకాంతంగా గడిపెందుకు వెళ్లారు. ఆ ఇద్దరు సరదాగా గడిపిన వీడియోలను తీసి లాడ్జి సిబ్బంది డబ్బులు ఇవ్వాలంటూ వేధింపులకు గురి చేశారు.
ఇది కూడా చదవండి: భార్య, అత్తను చంపి మృతదేహాలు పాతినచోట అరటి చెట్లు నాటాడు
ప్రేమజంటకు లాడ్జిలో వేధింపులు:
లాడ్జిలో సీక్రెట్ కెమెరాలతో వీడియోలను రికార్డు చేశారు. ఆ న్యూడ్ వీడియో ప్రేమ జంటకు చూపి వారి దగ్గర నుంచి డబ్బుల్ని డిమాండ్ చేశారు. ఇటీవల శ్రీ రాఘవ రామ రెసిడెన్సీలో ఈ ప్రేమ జంట గడిపారు. ఆ సమయంలో కూడా డబ్బులు డిమాండ్ చేయడం వలన సమస్య పెద్దదవకుండా ప్రేయసి బంగారం అమ్మేసి డబ్బులు ఇచ్చాడు ప్రేమికుడు. అంతటితో అగని సిబ్బంది మళ్లీ డబ్బులు కావాలని వేధింపులకు గురి చేస్తున్నారు. వారి వేధింపులు తట్టుకోలేక జరిగిన అన్యాయపై ఆ ప్రేమ జంట ఏం చేయాలో అర్థం కాక తీవ్ర మనో వేదనకు గురయ్యారు. ఒకరినొకరు ప్రేమించుకుంటున్న వీరు వ్యక్తిగత జీవితం గడిపేందుకు వెళ్లి ఇలా లాడ్జి సిబ్బంది వేదింపులకు గురయ్యారు.
అంతేకాదు ఈ వీడియోలను యువతుడికి పంపించి.. ఆందోళనకు గురి చేశారు. ఈ ప్రైవేట్ వీడియోలను ఇంటర్నెట్‌లో పెడతామని బెదిరించి.. లక్ష రూపాయల డబ్బు డిమాండ్ చేశారు. ప్రియురాలితో ఉన్న వీడియో చూసి యువకుడు కంగారుకు గురయ్యాడు. కానీ డబ్బు ఇచ్చినా కూడా సిబ్బంది ఆశ తీరలేదు మళ్లీ లాడ్జి అగంతకులు వేధింపులు చేయటం మొదలు పెట్టారు. డబ్బు ఇచ్చిన తర్వాత వీడియోలను డిలిట్ చేయాల్సింది పోయి మరోసారి బెదిరింపులకు పాల్పడటం ప్రేమికులను మరింత ఆందోళనకు గురయ్యారు. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ప్రేమికులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేసి.. లాడ్జి సిబ్బందిని విచారించడంతోపాటు సీసీ కెమెరాలు, ఇతర డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి.. లాడ్జికి వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే సీక్రెట్ సీసీ కెమెరాలు పెట్టి ఇలాంటి మోసాలు చేసేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు ఈ మధ్య కాలంలో. అందుకని ఎక్కడైనా ఎప్పుడైనా ఉండాల్సి వస్తే ఆ సమయంలో ముందుగానే కెమెరాలు ఉన్నాయా లేదా అని తనఖీ చేసుకుని వెళ్తే మంచిది. అప్పుడు ఇలాంటి మోసం చేసే సిబ్బంది నుంచి టార్చర్లు, వేధింపులు లేకుండా ఉంటాయి. ఇలాంటి విషయాల్లో ఎవరైనా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.
( latest-telugu-news | telugu crime news | telangana crime news )