Matka: తెలంగాణలో మట్కా మాయా జూదం.. ఆన్‌లైన్‌ వీడియోలతో లక్షల్లో టోకరా!

తెలంగాణలో మట్కా జూదం మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. తెలంగాణలో నిషేదం ఉన్నప్పటీకీ ఆదిలాబాద్, హైదరాబాద్ కేంద్రంగా రహస్యంగా ఆన్‌లైన్‌లో దందా నడిపిస్తున్నారు. రాబోయే నెంబర్ ముందే చెబుతామంటూ అమాయకులకు టోకరా వేసి వంద నుంచి లక్షల్లో దోచేస్తున్నారు. 

New Update
matka game

Telangana matka gamblings in online

తెలుగు రాష్ట్రాల్లో గంజాయి, డ్రగ్స్, ఆన్ లైన్ బెట్టింగ్స్ (Online Bettings) కారణంగా ఇప్పటికే యువత నాశనమైపోతుంటే తాజాగా మరో మాయ జూదం గుట్టు చప్పుకు కాకుండా నడుస్తోంది. ఇంట్లోనే మూలన కూర్చొని మొబైల్ చేతిలో పట్టి మట్కా గేమ్ (Matka Game) పేరుతో అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా సాగించే ఈ వ్యవహారం తాజాగా ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలో బయటపడింది. బాలాజీనగర్‌కు చెందిన యువకుడిని కాగజ్‌నగర్‌ టౌన్‌ సీఐ పల్నాటి రాజేంద్రప్రసాద్‌ పట్టుకుని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో ఆఫ్‌లైన్‌ విధానంలో ఆడే ఈ ఆటను ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఆడుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని పలువురు మోసాలకు పాల్పడుతున్నారు. 

Also Read :  కలిసింది 10 మంది ఎమ్మెల్యేలు కాదు.. 8 మందే.. మల్లు రవి సంచలనం!

రోజుకు 4 ఆటలు.. 

మహారాష్ట్రలో అధికారికంగా నిర్వహిస్తున్న ఈ జూదం తెలంగాణ (Telangana) లో నిషేధించారు. అయినప్పటికీ కొంతమంది రహస్యంగా నడిపిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కుమురంభీం జిల్లా మహారాష్ట్ర బార్డర్ లో ఉండటం వల్ల కొంతమంది యువకులు దీనిని ఆడడం అలవాటుగా మార్చుకుని ఇతరులను ఇందులోకి లాగుతున్నారు. కూలీ పనులు చేసుకుఏ వాళ్లతోపాటు చిరు, బడా వ్యాపారులను సైతం ఈ మట్కా ఆటలోకి దింపి లక్షల్లో కాజేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రాజధాని, కల్యాణ్, మెయిన్‌ బజార్, శ్రీదేవి, టైం, మిలన్‌ సంస్థల పేరుతో మట్కా దందా నడిపిస్తున్నారు. రోజుకు 4సార్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఒక్కో నంబర్‌ చొప్పున రిలీజ్ చేస్తారు. ఈ నంబర్‌ ఏమిటని ముందే చెప్పి పందెం కాస్తారు. 0 నుంచి 9 వరకు ఒక నెంబరు ఎంచుకుని ఓపెన్, క్లోజ్, బ్రాకెట్‌గా కేటాయించుకోవాలి. ఓపెన్‌ అండ్ క్లోజ్ కు రూ.100కు రూ.1000 లాభం ఉంటే బ్రాకెట్‌కు రూ.10కి రూ.1000, పానాకు రూ.10కి రూ.1300 ఇస్తారు. 

ఇది కూడా చదవండి: Maoist: పోలీసులపై దాడులు చేసేందుకు మవోయిస్టుల బిగ్ స్కెచ్.. హిడ్మాకు బదులు పతిరాం!

 అయితే కొంతమంది ఆన్ లైన్ లో రాబోయే నెంబర్ ముందే చెబుతామంటూ వీడియోలు పెడుతూ మోసాలకు పాల్పడుతున్నారు. ఆటకు ముందే చెప్పామంటూ ఆన్‌లైన్‌లో వీడియోలు పెట్టడంతో జనం నిజమే అనుకుని పెట్టుబడులు పెడుతున్నారు. హైదరాబాద్‌ లోనూ చాలామంది ఈ మోసాలు చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. దీంతో ఒక ఆట గెలిస్తే మరో నంబర్‌ చెప్పాలంటూ వీడియోలు పెడుతున్న వారిని అమాయకులు సంప్రదిస్తున్నారు. ఇదే అదనుగా వంద నుంచి లక్షల్లో డిమాండ్ చేస్తూ దోచేస్తున్నారు. ఇప్పటికే పలువురిని పట్టుకున్న పోలీసులు వారినుంచి నగదు, మొబైల్స్, ప్రింటర్, కెమెరా స్టాండ్, మట్కా కాగితాలు స్వాధీనం చేసుకున్నారు. 

Also Read :  నేడు సబ్ కమిటీకి కుటుంబ సర్వే నివేదిక..నివేదికలో ఏముందంటే....

Also Read :  నేడే ఆఖరి టీ20.. విజయంతో ముగిస్తారా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు