/rtv/media/media_files/2024/11/16/in1xsUggONhGAntpPCHG.jpg)
Ind vs Eng: భారత్-ఇంగ్లాండ్ మధ్య ఈ రోజు చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే 3-1తో ఈ సిరీస్‌ను భారత్ సొంతం చేసుకుంది. ఇక నామ మాత్రపు చివరి మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గి ఇరుజట్లు సిరీస్‌ను విజయంతో ముగించాలని చూస్తున్నాయి. ఈ మ్యాచ్ వాంఖడే మైదానంలో జరగనుండగా పిచ్ ఎప్పుడూ బ్యాటింగ్‌కే అనుకూలం ఉంటుంది. దీంతో ఈసారీ పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది. మొదటలో పేసర్లకు ఆ తర్వాత స్పిన్నర్లకు పిచ్ సహకారం లభిస్తుందని, టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది.
Shivam Dube and Hardik Pandya were at their power-hitting best as India wrapped a series win 👊#INDvsENGhttps://t.co/4xkTsVNNUc
— ICC (@ICC) January 31, 2025
కలవర పెడుతున్న భారత బ్యాటింగ్..
భారత బ్యాటింగ్ తడబాటు కొనసాగుతూనే ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్‌లు ఈ సిరీస్ లో పెద్దగా రాణించలేదు. అభిషేక్ శర్మ మొదటి మ్యాచ్ మినహా పరుగులేమీ చేయలేపోతున్నాడు. టాప్ ఆర్డర్ తప్పకుండా ఫామ్‌ను అందుకోవాల్సివుంది. హార్దిక్ పాండ్య, శివమ్ దూబె పరావాలేదనిపించారు. ఈ మ్యాచ్‌కు షమి జట్టులోకి వచ్చే అవకాశముండగా వరుణ్ సహా స్పిన్నర్ల ఫామ్ భారత్‌కు కలిసొచ్చే అంశమే.
4 టీ20 వివాదాస్పదం..
ఇదిలా ఉంటే.. భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్ హర్షిత్ రాణా దుమ్ము దులిపేశాడు. టీమిండియాను విజయపథంలో నడిపించాడు. శివమ్ దూబే స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన అతడు బౌలింగ్‌లో ఇరగదీసేశాడు. ఏకంగా మూడు వికెట్లు తీసి భారత జట్టు ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటర్ శివమ్ దూబే హెల్మెట్‌కు బంతి బలంగా తాకడంతో.. అతని బదులు హర్షిత్ ఆడాలని మేనేజ్ మెంట్ నిర్ణయించింది. దీంతో గ్రౌండ్‌లోకి వచ్చిన అతడు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశాడు. అయితే శివమ్ దూబేకు బదులు హర్షిత్ రాణా రావడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శివమ్ దూబె స్థానంలో బౌలర్‌ను ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. దూబె బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కాగా .. హర్షిత్ స్పెషలిస్ట్ పేసర్. ఇది సరిగ్గా లేదనిపిస్తోందని కామెంట్లు పెడుతున్నారు.