Bandage Se*x Case: బ్యాండేజ్ సె*క్స్ చేస్తుండగా భార్య మృతి.. పోలీసుల దర్యాప్తులో ఊహించని ట్విస్ట్!

తమిళనాడు వివాహిత శశికల హత్యకేసులో సంచలన విషయాలు బయపడ్డాయి. బ్యాండేజ్ సెక్స్ చేస్తుండగా ముక్కులోంచి రక్తం కారి చనిపోయినట్లు భర్త భాస్కర్ విచారణలో చెప్పాడు. కానీ వివాహేతర సంబంధం కారణంగానే తన బిడ్డను చంపేశాడని శశికల తండ్రి అరుల్ ఆరోపిస్తున్నారు. 

New Update
bandage sex

Tamilnadu women died bandage sex effect case

తమిళనాడులో ఓ భయంకరమైన కేసు కలకలం రేపుతోంది. జిమ్ ట్రైనర్స్‌గా పనిచేస్తున్న వివాహిత అనుమానాస్పద మృతిపై సంచలన విషయాలు బయటపడుతున్నాయి. బ్యాండేజ్ సెక్స్ చేస్తుండగా తన భార్య చనిపోయిందని భర్త చెబుతుండగా ఆమెపై ఉన్న రక్తపు మరకలు ఉండటంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  తమ బిడ్డను అల్లుడే హత్య చేశాడని ఆరో పిస్తుండగా ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read :  తాళి కట్టిన 15 నిమిషాలకే పెళ్లికొడుకు మృతి!

బ్యాండేజ్ సెక్స్ చేస్తుండగా..

హోసూర్‌లో భాస్కర్ (34), శశికళ ప్రేమించి 2018లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 4, 2 సంవత్సరాల ఇద్దరు పిల్లలున్నారు. భాస్కర్ కు నాలుగు జిమ్‌లుండగా అందులో శశికళ ఒక మహిళల జిమ్‌ బాధ్యతలు నిర్వహిస్తోంది. అంతకుముందు శశికళ బెంగళూరులో ప్లేయింగ్ స్కూల్‌ను నడిపింది. అయితే అనుకోకుండా శశికల చనిపోయింది. తాము బ్యాండేజ్ సెక్స్ చేస్తుండగా ఈ ఘోరం జరిగిందని భాస్కర్ శశికల పేరెంట్స్ కు చెప్పాడు. ఆమె ముక్కు నుంచి రక్తం కారిందని, ఆస్పత్రికి తరలించగా వైద్యులు అప్పటికే చనిపోయిందని చెప్పినట్లు నమ్మించాడు. కానీ ఆమె పేరెంట్స్ అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Also Read: టర్కీకి ఓవైసీ సీరియస్ వార్నింగ్.. ఆ విషయం గుర్తు పెట్టుకోవాలంటూ.. !

శశికళ తండ్రి అరుల్ అల్లుడు భాస్కర్ పై సంచలన ఆరోపణలు చేశారు. భాస్కర్ తన బిడ్డను కొట్టేవాడని, గతంలో రెండుసార్లు ఆసుపత్రిలో చేర్చి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. అంతేకాదు కట్నంగా రూ. 14 లక్షలు ఇచ్చామని, అయినా తన బిడ్డను సరిగా చూసుకోలేదని వాపోయాడు. శశికల చేతులు, కాళ్ళు కట్టివేసి, గొంతు నులిమి చంపేశాడని ఆందోలన వ్యక్తం చేశాడు. శశికళ గతంలో భాస్కర్ కు వివాహేతర సంబంధం ఉందని అనుమానించిందని ఈ సందర్భంగా గుర్తుచేసిన అరుల్.. అదే కారణంతో తన బిడ్డను హతమార్చినట్లు ఆరోపిస్తున్నాడు.  

Also Read: పాకిస్థాన్ స్పైగా ఇండియన్ యూట్యూబర్.. మొత్తం ఆరుగురు అరెస్ట్! ఆ రాష్ట్రాల్లో వీరి నెట్ వర్క్

Also Read :  ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్, 15 మందికి గాయాలు!

tamilnadu | women | murder | husband | today telugu news

Advertisment
తాజా కథనాలు