/rtv/media/media_files/2025/01/29/rPGCnm0ASOGfMCOS2T8J.jpg)
suryapeta Photograph: (suryapeta)
Suryapeta Murder Case: సూర్యపేట కులాంతర వివాహం మర్డర్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.- కృష్ణ హత్యలో భార్గవి తండ్రి సైదులు ప్రధాన హస్తం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఎలా హత్య చేయాలో తన కుమారులకు భార్గవి తండ్రి సైదులు స్కెచ్ గీసి ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురు భార్గవి ప్రేమ వివాహం చేసుకోవడంతో గ్రామంలో, కులంలో పరువు పోయిందనే కోపంలో సైదులు ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Maha Kumbh Mela 2025: కుంభమేళాలో తొక్కిసలాటతో స్పెషల్ రైళ్లు రద్దు.. రైల్వేశాఖ క్లారిటీ!
Also Read: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!
ఎలాగైనా చంపాలనే లక్ష్యంతో..
ఈ మేరకు కృష్ణను ఎలాగైనా చంపాలనే లక్ష్యంతో సైదులు మాస్టర్ ప్లాన్ వేశాడు. ముందుగా జనవరి 19న స్కెచ్ వేసిన సైదులు అది కుదరకపోవడంతో జనవరి 26న మరోసారి మర్డర్ ప్లాన్ వేశాడు. తన కుమారులతోపాటు వారి స్నేహితులకు అండగా నిలిచిన సైదులు ఈ దారుణం మొత్తం తన కనుసన్నల్లో జరిపించినట్లు బయటపడింది. ఈ మర్డర్ కేసులో మొత్తం ఆరుగురిని నిందితులుగా చేర్చారు. భార్గవి సోదరులు నవీన్, వంశీతో పాటు నాన్నమ్మ బుచ్చమ్మ, తండ్రి సైదులు, నవీన్ స్నేహితులు మహేష్, సాయి చరణ్ ను అరెస్ట్ చేశారు.
Also Read: Mazaka Movie: రోడ్లపై సందీప్ కిషన్, రావు రమేష్ డాన్సులు.. 'బ్యాచిలర్స్ ఆంథెమ్' వచ్చేసింది !
నాన్నమ్మకు విపరీతమైన కుల పిచ్చి
మరోవైపు కృష్ణ అలియాస్ మాలబంటి హత్య కేసులో భార్య భార్గవి సంచలన విషయాలు బయటపెట్టింది. అంతా తన నాన్నమ్మనే చేయించినట్లు తెలిపింది. "నాన్నమ్మకు విపరీతమైన కుల పిచ్చి ఉంది. కులం తక్కువ వాడిని చేసుకున్నానని నన్ను చాలా సార్లు కొట్టింది. మా అన్నయ్యను నాన్నమ్మే రెచ్చగొట్టి హత్య చేసేలా చేసింది. నానమ్మ కళ్ళలో ఆనందం చూడడానికి మా అన్నయ్య కృష్ణను చంపేశాడు. హత్య తర్వాత నాన్నమ్మకు డెడ్ బాడీ చూపించి సంతృప్తి పరిచారు. బంటి ప్రైవేట్ పార్ట్స్‌ను కసితీరా తొక్కి మా నాన్నమ్మ కోపం చల్లార్చుకుంది. నా భర్త హత్యకు కారణమైన మా అన్నయ్య, నాన్నమ్మకు ఉరిశిక్ష వేయాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది భార్గవి. " మొదటి నుంచి మనవరాలు కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టంలేని భార్గవి నాన్నమ్మ బుచ్చమ్మ కోపంతో రగిలిపోయింది. కృష్ణనను చంపేయమని తన కొడుకు, మనవళ్లను రెచ్చగొట్టి పరోక్షంగా హత్యకు కారణమైంది.
రాత్రంతా కారు డిక్కీలోనే
ఆదివారం రాత్రి 9 గంటలకు కృష్ణను హత్య చేసిన నిందితులు రాత్రంతా శవాన్ని కారు డిక్కీలోనే పెట్టుకొని తిరిగారు. ముందుగా నల్గొండ పరిసరాల్లోనే శవాన్ని వదిలేయాలని భావించారు. కానీ, అది సాధ్యం కాకపోవడంతో తిరిగి సూర్యపేటకు తీసుకొచ్చారు. చివరిగా పిల్లలమర్రి సమీపంలోని మూసీ కాల్వకట్టపై కృష్ణ డెడ్ బాడీని పడేసి పరారయ్యారు. చెల్లెలు కులాంతర వివాహం చేసుకోవడం జీర్ణించుకోలేని నవీన్ రెండు నెలల నుంచే కృష్ణను హత్యకు ప్లాన్ సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే తాళ్లగడ్డకు చెందిన బైరు మహేశ్, నల్గొండకు చెందిన మరో యువకుడి సహాయం తీసుకున్నాడు. ప్లాన్ ప్రకారమే మహేష్ కృష్ణతో స్నేహంగా నటించాడు. అలా కృష్ణను ట్రాప్ చేసి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది.
ఇది కూడా చదవండి: Johny master : జానీ మాస్టర్ పై కేసు.. తొలిసారి నోరు విప్పిన కొరియోగ్రాఫర్.. సంచలన ఇంటర్వ్యూ!