ACB Raids : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్..!
భూమి రిజిస్ట్రేషన్ విషయంలో లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో సబ్ రిజిస్ట్రర్ మహమ్మద్ తస్లిమా లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.