కడప దర్గా వివాదంలో రామ్ చరణ్.. మాల తీసి క్షమాపణ చెప్పాలి!
హీరో రామ్ చరణ్ అయ్యప్ప మాలలో కడప పెద్ద దర్గాను సందర్శించడం వివాదాస్పదంగా మారింది. దీక్షలో ఉంది దర్గాకు ఎలా వెళ్తారని తెలంగాణ ఐక్య వేదిక ప్రతినిధులు మండిపడుతున్నారు. మాలలో దర్గాకు వెళ్లడంపై చరణ్ వివరణ ఇవ్వాలని, క్షమాపణ కూడా చెప్పాలని డిమాండ్ చేశారు.