/rtv/media/media_files/2025/01/29/BJAWdutX0YDhX36n75nA.jpg)
soudi arebia Photograph: (soudi arebia)
Saudi Arabia road accident: సౌదీ ఆరేబియాలో జనవరి 29న (బుధవారం) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 9 మంది భారతీయ పౌరులు దుర్మరణం చెందారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అక్కడి ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. సౌదీ అరేబియా పశ్చిమ ప్రాంతంలోని జిజాన్ నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జెడ్డాలోని భారత రాయబార కార్యాలయం మృతుల వివరాలు సేకరిస్తోంది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, స్థానిక అధికారులతో ఘటనపై ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని భారతీయ రాయభార కార్యలయం తెలిపింది.
Also Read: అప్పుడు కూడా ఇలానే.. కుంభమేళాలో 800 మంది మృతి
Grieved to learn of this accident and the loss of lives. Spoke with our Consul General in Jeddah, who is in touch with the concerned families. He is extending fullest support in this tragic situation. https://t.co/MHmntScjOT
— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 29, 2025
Also Read : షకలక బూంబూం ఆట మిగిల్చిన విషాదం.. 6ఏళ్ల చిన్నారి మృతి!
మంత్రి ఎస్ జైశంకర్ స్పందిస్తూ..
ఈ విషాద ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. సౌదీ రోడ్డు ప్రమాదంలో భారత పౌరులు ప్రాణాలు కోల్పోయిన వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. జెడ్డాలోని రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిగిపి మృతదేహాలను ఇండియా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తు్నామని ఆయన ఎక్స్‌లో తెలిపారు.
Also Read: ఇది 8వ వింత! యువతి కడుపులో బిడ్డ.. ఆ బిడ్డ కడుపులో మరో బిడ్డ!
Also Read: Maha Kumbh Mela 2025: కుంభమేళాలో తొక్కిసలాటతో స్పెషల్ రైళ్లు రద్దు.. రైల్వేశాఖ క్లారిటీ!