/rtv/media/media_files/2025/01/29/k1wO5gJgSvEuZQ02vYEX.jpg)
kumbhamela 1954 Photograph: (kumbhamela 1954)
kumbh mela stampede: అది ఫిబ్రవరి 3, 1954.. మౌని అమావాస్య. ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన మొదటి కుంభమేళా. ఆరోజు ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 800 మంది చనిపోయారు. దాదాపు 2వేల మందికిపైగా గాయాలపాలైయ్యారు. ఇండియా చరిత్రలోనే ఇది అత్యంత విషాద గాధ. పుణ్యస్నానాలు ఆచరిద్దామని వచ్చిన భక్తులు తిరిగిరానిలోకాలకు వెళ్లారు. సరిగ్గా అలాంటి ఘటనే మళ్లీ 2025 జనవరి 28న చోటుచేసుకుంది. ఉత్తరప్రద్రేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో 20 మంది మృతి చెందారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మొత్తం 45 రోజులపాటు మహాకుంభమేళా జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల హిందువుల గంగా, యమున, సరస్వతి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించడానికి వస్తున్నారు. ప్రతి 12ఏళ్లకు ఓసారి మహాకుంభమేళా జరుగుతుండగా.. తొక్కిసలాట చోటుచేసుకొని భారీగా భక్తులు చనిపోయిన సంఘటనలు ఇలా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: బ్రిటన్‌కు ‘హిందూత్వం’ ముప్పు.. సంచలన రిపోర్ట్
హరిద్వార్‌లోని కుంభమేళాలో 200 మంది..
1986 హరిద్వార్ కుంభమేళాలో జరిగిన తొక్కీసలాటలో 200 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వీర్ బహదూర్ సింగ్ వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యమంత్రులు, పార్లమెంటు సభ్యులతో కలిసి హరిద్వార్‌కు రావడంతో గందరగోళం నెలకొంది. భద్రతా సిబ్బంది సాధారణ ప్రజలను నదీతీరాల్లోకి రానీయకుండా ఆంక్షలు విధించడంతో, జనం ఒక్కసారిగా పెరిగి, అదుపు చేయలేక ఘోర తొక్కిసలాటకు దారితీసింది.
ఇది కూడా చదవండి : మహా కుంభమేళా తొక్కిసలాటకు కారణం ఇదే !
నాసిక్‌లో కుంభమేళాలో 39 మంది మృతి
2003న మహారాష్ట్ర నాసిక్‌లో కుంభమేళా సందర్భంగా పవిత్ర స్నానానికి వేలాది మంది భక్తులు గోదావరి నది ఒడ్డుకు చేరుకున్నారు. భారీ సంఖ్యలో భక్తులందరూ ఒకే చోట గుమిగూడటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. అందులో పలువురు మహిళలతో సహా 39 మంది చనిపోయారు. మరో 100 మందికి గాయాలు అయ్యాయి.
అలహాబాద్ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట
2013 కుంభమేళా సమయంలో ప్రయాణీకుల రద్దీ ఎక్కువై రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాటకు దారితీసింది. దీంతో అలహాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకులు నడిచే బ్రిడ్జ్ కూలిపోయింది. భయంతో ప్రయాణీకులంతా పరుగులు తీశారు. దీంతో జరిగిన తొక్కిసలాటలో 42 మంది ప్రాణాలు కోల్పోగా, 45 మంది గాయపడ్డారు.