AP CRIME: షకలక బూంబూం ఆట మిగిల్చిన విషాదం.. 6ఏళ్ల చిన్నారి మృతి!

ఆరేళ్ల చిన్నారి షకలక బూంబూం ఆట ఆడి తన ప్రాణాలు కోల్పోయిన ఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. న్యూయర్ వేడుకల వేళ తన స్నేహితులతో కలిసి షకలక బూంబూం ఆట ఆడింది. అందులో చిన్నారికి మంటలు అంటుకున్నాయి. దీంతో 27రోజులు చికిత్స పొందుతూ తాజాగా మృతి చెందింది.

New Update
6 year old girl dies after playing Shaka Laka Boom Boom game

6 year old girl dies after playing Shaka Laka Boom Boom game

షకలక బూం బూం.. ఈ ఆట గురించి తెలియని వారుండరు. పల్లెటూరిలో ఉండే వారు చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా, ఆసక్తిగా ఈ ఆటను ఆడేవారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా తెగ ఆడేసేవారు. ఇప్పటికి ఏదో ఒక గ్రామంలో ఈ ఆటను ఆడుతున్నారు. అయితే ఈ షకలక బూం బూం ఆట ఆడి తాజాగా ఓ చిన్నారి తన ప్రాణాలు కోల్పోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: ప్లీస్ నా మాట వినండి.. భక్తులకు సీఎం యోగి కీలక విజ్ఞప్తి!

షకలక బూం బూం ఆట

అది 2025 జనవరి 1. అందరూ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్నారు. అందులో ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన ఆరేళ్ల చిన్నారి సరదాగా తన స్నేహితులతో కలిసి షకలక బూం బూం ఆట ఆడింది. ఈ క్రమంలోనే అగ్గిపుల్లలను అన్నింటిని ఒకచోట పేర్చి మధ్యలో కొవ్వొత్తి ఉంచారు. 

Also Read: మహా కుంభమేళాలో తొక్కిసలాట.. అమృత స్నానాలపై అఖండ పరిషత్‌ కీలక నిర్ణయం

అనంతరం దాన్ని వెలిగించడంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఆపై ఆ మంటలు చిన్నారికి అంటుకున్నాయి. దీంతో శరీరం మొత్తం కాలిపోయి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు ఆ చిన్నారిని విజయవాడలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో చేర్పించారు. 

Also Read: కుంభమేళాలో తొక్కిసలాట.. కన్నీరు పెట్టించే దృశ్యాలు..!

అక్కడ కొన్ని రోజులు చికిత్స పొందిన తర్వాత ఆ చిన్నారి పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. దీంతో హుటా హుటిన ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ.. దాదాపు మూడు వారాలకు పైగా అంటే 27 రోజులకు పైగా చికిత్స చేశారు. కానీ ఒళ్లంతా కాలిపోవడంతో అధికమొత్తంలో ఇన్ఫెక్షన్ చేరిపోయింది. దీంతో ఎన్నిరోజులు శ్రమించినా.. ఆ చిన్నారి కోలుకోలపోయింది. చివరికి ప్రాణాలు విడిచింది. ఆ చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు