/rtv/media/media_files/2025/08/19/dharmasthali-2025-08-19-11-46-49.jpg)
ధర్మస్థల పుర్రెల కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మస్థల చుట్టూవందలాది మృతదేహాలను, ముఖ్యంగా మహిళలు, మైనర్ బాలికల మృతదేహాలను తానూ సామూహికంగా ఖననం ఖననం చేశారని మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ముసుగు మనిషి భీమా చేసిన ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పుడు భీమా మాట మార్చేశాడు. బలవంతంగా తనతో ఈ ప్రకటన చేయించారంటూ సంచలన కామెంట్స్ చేశాడు. ఒక పుర్రెను తనకు ఒక బృందం ఇచ్చి, తానై ఈ ప్రకటన చేయాలని ఒత్తిడి చేసిందని సిట్ అధికారుల ఎదుట చెప్పాడు. దీంతో కేసులో కొత్త మలుపులు చోటు చేసుకున్నాయి. 13 స్పాట్లలో ఒక్క చోట మాత్రమే అస్థిపంజరాలు దొరికాయి. దీంతో తవ్వకాలు నిలిపివేశారు సిట్ అధికారులు. భీమాను ప్రేరేపించిన వ్యక్తులకు నోటీసులు ఇవ్వాలని సిట్ అధికారులు నిర్ణయించారు.
"நான் கொடுத்த எலும்புக்கூடு போலியானது". கர்நாடகாவில் தர்மஸ்தலா மீது குற்றம் சுமத்தியவர் ஒப்புதல்.
— Vijayabharatham Weekly (@v_bharatham) August 19, 2025
நூற்றுக்கணக்கான பெண்கள் பிணங்களை புதைத்ததாக சொன்ன குற்றச்சாட்டு, பொய் என்று ஏற்கனவே அம்பலமானது குறிப்பிடத்தக்கது.#Karnataka#Dharmasthala#Fakenewspic.twitter.com/YKKWTiGBoU
మహిళలు, మైనర్ బాలికల మృతదేహాలను సామూహికంగా ఖననం చేయాలని ఆలయ పెద్దలు తనను బెదిరించారని భీమా ఇటీవల ఆరోపించాడు. మరణించిన వారిలో చాలామంది లైంగిక దాడులకు గురై హత్య చేయబడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఫిర్యాదుదారుడు చూపించిన 15 ప్రదేశాలలో సిట్ తవ్వకాలు జరిపింది.
Also Read : Heavy Rains: తెలంగాణలో ఈ జిల్లాల్లో వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ
రాజకీయంగానూ పెను దుమారం
ఈ కేసు కర్ణాటకలో రాజకీయంగానూ పెను దుమారం రేపింది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య వాదోపవాదాలకు ఇది కారణమైంది. ఈ కేసును ప్రభుత్వం సరిగ్గా దర్యాప్తు చేయడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం, ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. లభ్యమైన అస్థిపంజరాలు,ఎముకల ఫోరెన్సిక్ నివేదికలు మరియు ఫిర్యాదుదారుడి తాజా వాంగ్మూలం ఆధారంగా కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సాక్షి ఆరోపణలు నిరూపణ కాకపోతే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర స్పష్టం చేశారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read : బండ్లగూడలో విషాదం.. వినాయక విగ్రహం తీసుకొస్తుండగా ఇద్దరు యువకులు మృతి