/rtv/media/media_files/2025/08/18/nandyal-crime-news-2025-08-18-07-39-48.jpg)
Nandyal Crime News
నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మహానందిలో ఓ చిన్నారికి పెను ప్రమాదం తప్పింది. కర్ణాటక రాష్ట్రం బీజాపూర్‌కు చెందిన దంపతులు తమ చిన్నారిని కారులో ఉంచి దర్శనానికి వెళ్లగా.. ఊపిరాడక ఇబ్బంది పడిన పాపను స్థానికులు, ఆలయ సిబ్బంది సమయస్ఫూర్తితో కాపాడారు. ఈ సంఘటన ఆలయ ప్రాంగణంలో కలకలం రేపింది. బీజాపూర్‌కు చెందిన దంపతులు దర్శనం కోసం మహానందికి వచ్చారు. అయితే వారు తమ చిన్నారిని కారులోనే వదిలి, సెంట్రల్ లాక్ చేసి ఆలయంలోకి వెళ్లారు. కొంత సమయం తర్వాత కారులో నుంచి చిన్నారి ఏడుపు వినిపించడంతో అటుగా వెళ్తున్న భక్తులు గమనించి ఆలయ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఆలయ సిబ్బంది, అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
అద్దాన్ని పగలగొట్టి చిన్నారిని బయటకు..
కారు అద్దాలు మూసి ఉండటం, చిన్నారి ఊపిరాడక తీవ్ర ఇబ్బంది పడుతుండటం గమనించి ఆలయ కానిస్టేబుల్ నరేంద్ర చొరవ తీసుకున్నారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా.. తన లాఠీతో కారు అద్దాన్ని పగలగొట్టి చిన్నారిని బయటకు తీశారు. అప్పటికే పాప శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో.. ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ సమయానికి స్పందించడం వల్ల పెను ప్రమాదం తప్పింది.
ఇది కూడా చదవండి: కృష్ణాష్టమి వేడుకలో తీవ్ర విషాదం.. ఊరేగింపులో ఐదుగురు మృతి
ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న హోం మంత్రి అనిత.. కానిస్టేబుల్ నరేంద్రతో పాటు ఆలయ సిబ్బందిని ప్రశంసించారు. చిన్నారిని కాపాడినందుకు వారి సమయస్ఫూర్తిని కొనియాడారు. అనంతరం దేవస్థానం మైకుల ద్వారా అనౌన్స్‌మెంట్ చేయడంతో దాదాపు 15 నిమిషాల తర్వాత తల్లిదండ్రులు ఆలయం నుంచి వచ్చి తమ పాపను సురక్షితంగా తీసుకువెళ్లారు. ఈ సంఘటనను చూసి అక్కడున్న భక్తులు, స్థానికులు కానిస్టేబుల్ నరేంద్రపై ప్రశంసల వర్షం కురిపించారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలని పలువురు అంటున్నారు.
ఇది కూడా చదవండి: వడ్డీ వ్యాపారుల వేధింపులు.. వివాహిత సెల్ఫీ వీడియో తీసుకుని