Odisha: పాపం.. భార్య వేధింపులకు మరో భర్త బలి

ఒడిశాకు చెందిన ఓ భర్త భార్య పెట్టే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని వీడియో ద్వారా తెలిపాడు. భార్య వేధింపులు భరించలేక కదులుతున్న రైలు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

New Update
Odisha crime

Odisha crime Photograph: (Odisha crime)

భార్య వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు రోజురోజుకీ ఎక్కువ అవుతున్నాయి. ఇటీవల బెంగళూర్‌లో అతుల్ సుభాష్ భార్య వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది భర్తలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఒడిశాకు చెందిన మరో వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. భార్య పెట్టే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో ద్వారా తెలిపాడు. ఒడిశాలోని ఖుర్దాలో కదులుతున్న రైలు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఇది కూడా చూడండి: Agniveers: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

భార్య పెట్టే మానసిక వేధింపులు భరించలేక..

ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తి వీడియో తీశాడు. నేను రామచంద్ర బర్జెనా కుంభర్‌బస్తాలో ఉంటున్నాను. నా భర్య పెట్టే వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియోలో తెలిపాడు. అయితే వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. తన భార్య కొన్ని రోజుల నుంచి రామచంద్రను మానసికంగా వేధిస్తోంది. దీనివల్ల ఇంట్లో గొడవలు అవుతున్నాయి. 

ఇది కూడా చూడండి: 57ఏళ్ల వయసులో ఇదేం బుద్ధి.. లవర్ తండ్రి అస్థికలతో బ్లాక్‌మెయిల్ ‘వస్తేనే ఇస్తా’

విడాకులు కూడా ఇస్తానని బెదిరిస్తోంది. ఇన్నీ భరించలేక రామచంద్ర ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియోలో తెలిపాడు. దీంతో రామచంద్ర తల్లిదండ్రులు కోడలిపై ఫిర్యాదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 108, 351(2), 3(5) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఇది కూడా చూడండి: Jibli Trend: జిబ్లీలో ఫోటోలు అప్ లోడ్ చేస్తున్నారా..అయితే జాగ్రత్త

భార్య రూపాలి భర్త, అత్త మామల మాట కూడా వినేది కాదు. ఎప్పుడు పడితే అప్పుడు కన్నవారింటికి వెళ్లేదని అత్తమామలు ఆరోపించారు. కనీసం వారి మాటకు గౌరవం లేకుండా వ్యవహరించేదని, రామచంద్ర తల్లిదండ్రులు తెలిపారు.

ఇది కూడా చూడండి: GT VS SRH: హైదరాబాద్ ఇక ఇంటికి వెళ్ళిపోయినట్లే...వరుసగా నాలుగో ఓటమి

 

husband | odisha | Latest crime news | telugu-news | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu | telugu crime news | breaking news in telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు