/rtv/media/media_files/2025/04/08/6cvMFUfemhjD5h9Tlsfj.jpg)
Miyapur Road Accident Photograph: (Miyapur Road Accident)
మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. పోలీసులు యూ టర్న్ తీసుకుంటుండగా అతి వేగంతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ సింహాచలం మృతి చెందగా.. మరో ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో రాజవర్ధన్, వికేందర్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇది కూడా చూడండి: Today Gold Rate: కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?
మియాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం
— Telangana Awaaz (@telanganaawaaz) April 8, 2025
మియాపూర్ మెట్రో పిల్లర్ 600 వద్ద యూ టర్న్ తీసుకుంటుండగా అంటూ వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది
ఈ ప్రమాదం లో ట్రాఫిక్ కానిస్టేబుల్ సింహాచలం మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరొక కానిస్టేబుల్ రాజవర్ధన్
కేసు నమోదు… pic.twitter.com/f7QoHUGDXp
ఇది కూడా చూడండి: Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు
కల్లు తాగి అస్వస్థత..
ఇదిలా ఉండగా ఇటీవల కల్తీ కల్లు తాగి 58 మంది తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. నస్రుల్లాబాద్ మండలం అంకోల్, అంకోల్ తండా, దుర్కి, బీర్కూర్ దామరంచ గ్రామాల్లో కల్తీ కల్లు తాగిన వారంతా ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. ఈ కల్తీ కల్లు వల్ల ఒక్కసారిగా మతిస్థిమితం కోల్పోయారు.
ఇది కూడా చూడండి: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!
వింతగా ప్రవర్తించడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ కల్తీ కల్లు తాగిన వారిలో కొందరి పరిస్థితి సీరియస్‌గా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో వెంటనే ఎక్సైజ్ అధికారులు కల్లు దుకాణానికి వెళ్లి శాంపిల్స్ సేకరించి వాటిని క్లోజ్ చేశారు.
ఇది కూడా చూడండి: Telangana: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!
miyapur | latest-telugu-news | telugu-news | road-accident | today-news-in-telugu | latest telangana news | telangana crime incident | telangana crime news | telangana-crime-updates