Ind: వాణిజ్యం, టెక్నాలజీ..జేడీ వాన్స్ తో ప్రధాని మోదీ చర్చించిన అంశాలివే..

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నిన్న ఇండియా వచ్చారు. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వీరివురూ సుంకాలు, వాణిజ్యం, టెక్నాలజీ, రక్షణ వంటి అంశాలపై చర్చించారని తెలుస్తోంది. ఎక్కువగా టారీఫ్ లపైనే మాట్లాడుకున్నట్లు చెబుతున్నారు. 

author-image
By Manogna alamuru
New Update
ind

PM Modi, J.D Vance

అమెరికా అధ్యక్షుడు టారీఫ్ లు విధించడం, వాటికి మళ్ళీ 90 రోజుల విరామం ప్రకటించిన నేపథ్యంలో నిన్న ప్రధాని మోదీ, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరూ పలు ముఖ్యమైన విషయాల మీద చర్చించుకున్నారు. ఇందులో ఎక్కువగా భారత్, అమెరికా మధ్య వాణిజ్యం, సుంకాల మీదనే చర్చించుకున్నారని తెలుస్తోంది. వీటితో పాటూ రక్షణ, టెక్నాలజీ లాంటి విషయాల మీద కూడా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ ఈ ఏడాదిలో రానుండటంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లో వాన్స్ తో మోదీ అన్నారు. 

Also Read:  Khushboo Patani: చిన్నారిని కాపాడిన దిశా పటాని అక్క .. ఈ విషయం తెలుసుకుంటే సెల్యూట్‌ చేస్తారు

ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు..

ఇండియా, యూఎస్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై చర్చించారు. ఇరు దేశాలకు పరస్పరంగా మంచి జరిగేలా తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. సుంకాల వలన ఇరు దేశాల మధ్య సంబంధాలు చెడిపోకూడదని ప్రధీని మోదీ చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో పాటూ భారత్, అమెరికా దేశా లప్రజలకు లాభం కలిగించేలా చర్యలు తీసుకోవాలని నేతలు ఇరువురూ అంగీకరించారని చెబుతున్నారు. వాణిజ్యం, రక్షణ, టెక్నాలజీ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపై ఇరు దేశాల నేతలు చర్చించినట్లు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. 

Also Read: దుబాయ్ నుంచి బ్యాగ్‌ తెచ్చిన భర్త.. చంపి అదే బ్యాగ్‌లో ప్యాక్ చేసిన భార్య.. ఎలా దొరికిందంటే?

 

pm-modi | jd-vance | today-latest-news-in-telugu | donald trump tariffs  india

Also Read: Singer Pravasthi మెంటల్ టార్చర్, బాడీ షేమింగ్ చేశారు.. కీరవాణి పై సింగర్ ప్రవస్తి సంచలన ఆరోపణలు!

Also Read :  ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావేంట్రా.. ‘సీఎం రేవంతన్న కుదిర్చిన ముహూర్తానికే నా పెళ్లి.. లేదంటే’!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు