US Woman: 70ఏళ్ల వయసులో ప్రేమ.. అమెరికా నుంచి పెళ్లి కోసం వస్తే హత్య

పంజాబ్‌లోని లూధియానా జిల్లాకు చెందిన చరణ్‌జిత్ సింగ్ గ్రెవాల్ యూకేలో స్థిరపడ్డాడు. మ్యాట్రిమోనియల్ సైట్‌లో పరిచయమైన 71 ఏళ్ల రూపేంద్ర కౌర్ పాంధెర్‌ను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అమెరికా సీటెల్‌లో నివసించే రూపేంద్ర, ఇండియా వచ్చింది.

New Update
US women

ఆమెకు 71ఏళ్లు, అతనికి 75ఏళ్లు ఆన్‌లైన్ మాట్రిమోనియల్ సైట్‌(Online Matrimonial Site) లో ఇద్దరు కలుసుకున్నారు. ఆమె భారతీయ మూలాలు ఉన్న అమెరికా మహిళా, అతనిది పంజాబ్‌(punjab) లోని లూధియానా జిల్లా అయితే యూకేలో స్థిరపడ్డాడు. చరణ్‌జిత్ సింగ్ గ్రెవాల్, మ్యాట్రిమోనియల్ సైట్‌లో పరిచయమైన 71 ఏళ్ల రూపేంద్ర కౌర్ పాంధెర్‌ను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అమెరికాలోని సీటెల్‌లో నివసించే రూపేంద్ర, తన ఆస్తి వివాదం విషయంలో గ్రెవాల్ సహాయం కోరింది. గ్రెవాల్ ఆమెకు సహాయం చేస్తానని చెప్పి, లూధియానాలోని ఓ కోర్టులో టైపిస్ట్‌గా పనిచేసే సుఖ్‌జీత్ సింగ్ అనే వ్యక్తిని పరిచయం చేశాడు. చట్టపరమైన లిగల్ ఇష్యూలో సహాయం చేయడానికి ఆమె జూలైలో పంజాబ్‌కు రావాలని చెప్పాడు. ఆమె భారత్‌కు వచ్చిన తర్వాత, ఆమెను సుఖ్‌జీత్ సింగ్ ఇంట్లో ఉండమని గ్రెవాల్ చెప్పాడు.

Also Read :  ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

US Woman Murder In India

అయితే, గ్రెవాల్‌కు రూపేంద్రను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఆమె నుంచి డబ్బు సంపాదించుకోవడమే అతని టార్గెట్. ఆమె భారత్‌కు వచ్చిక, చంపేస్తే ఆమె డబ్బు తన వద్దే ఉండిపోతుందని భావించాడు గ్రైవాల్. ఈ క్రమంలో సుఖ్‌జీత్ సింగ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. రూపేంద్రను చంపి, ఆధారాలు లేకుండా చేస్తే సుఖ్‌జీత్‌కు రూ.50 లక్షలు ఇస్తానని, అంతేకాకుండా అతడిని విదేశాల్లో స్థిరపడేందుకు కూడా సహాయం చేస్తానని హామీ ఇచ్చాడు.

గ్రెవాల్ హామీకి ఆశపడ్డ సుఖ్‌జీత్ సింగ్, రూపేంద్రను బేస్‌బాల్ బ్యాట్‌తో కొట్టి చంపాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని కాల్చి, అవశేషాలను ఓ కాలువలో పడేశాడు. అలాగే, ఆమె మొబైల్ ఫోన్‌ను పగలగొట్టి పడేశాడు. ఈ ఘటన జరిగిన తర్వాత రూపేంద్ర సోదరి ఆమెకు కాల్ చేయడానికి ప్రయత్నించగా ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో అనుమానం వచ్చింది. ఆమె అమెరికా ఎంబసీని ఆశ్రయించగా, వారు భారత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల విచారణలో సుఖ్‌జీత్ సింగ్ ఈ నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు అతనిని అరెస్టు చేసి, గ్రెవాల్‌పై కూడా హత్య కేసు నమోదు చేశారు. అయితే, గ్రెవాల్ ప్రస్తుతం యూకేలో ఉన్నాడు. ఈ ఘటనతో ఎన్నారై వివాహాల విషయంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.

Also Read :  రూ.50వేలకు సీపీఐ నేత కక్కుర్తి.. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి!

Advertisment
తాజా కథనాలు